ట్రోఫీ ఆడేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు హాకీ క్రీడాకారులు..
మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఈ ఘటనలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు షహనవాజ్‌ఖాన్ ఇండోర్ వాసి, ఆదర్శ్ ఇటార్సీ వాసి, ఆసీస్ లాల్ జబల్‌పూర్ వాసి, అనికేత్ గ్వాలియర్ వాసిగా గుర్తించారు. హోసంగాబాద్‌లో జరుగుతున్న ధ్యాన్‌చంద్ ట్రోఫీలో పాల్గొనడానికి ఇటార్సీ నుంచి వెళుతుండగా.. రైసల్‌పూర్ గ్రామం సమీపంలోని 69వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న […]

మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఈ ఘటనలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు షహనవాజ్‌ఖాన్ ఇండోర్ వాసి, ఆదర్శ్ ఇటార్సీ వాసి, ఆసీస్ లాల్ జబల్‌పూర్ వాసి, అనికేత్ గ్వాలియర్ వాసిగా గుర్తించారు. హోసంగాబాద్‌లో జరుగుతున్న ధ్యాన్‌చంద్ ట్రోఫీలో పాల్గొనడానికి ఇటార్సీ నుంచి వెళుతుండగా.. రైసల్‌పూర్ గ్రామం సమీపంలోని 69వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందదిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.