AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి.. ఆ ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే..

పాకిస్తాన్ పై అమెరికా క్రమేపీ ఒత్తిడి పెంచుతోంది. తన గడ్డపై సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించింది. లష్కరే-తోయిబా టాప్ లీడర్ హఫీజ్ సయీద్ తో బాటు నలుగురిని సాధ్యమైనంత త్వరగా ప్రాసిక్యూట్ చేయాలని అమెరికా దాదాపు డిమాండ్ చేసింది. పాక్ ను బ్లాక్ లిస్టులో పెట్టే విషయమై గ్లోబల్ యాంటీ టెర్రరిస్ట్ వాచ్ డాగ్ అయిన ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా […]

పాకిస్తాన్ పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి.. ఆ ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే..
Anil kumar poka
|

Updated on: Oct 14, 2019 | 1:10 PM

Share

పాకిస్తాన్ పై అమెరికా క్రమేపీ ఒత్తిడి పెంచుతోంది. తన గడ్డపై సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించింది. లష్కరే-తోయిబా టాప్ లీడర్ హఫీజ్ సయీద్ తో బాటు నలుగురిని సాధ్యమైనంత త్వరగా ప్రాసిక్యూట్ చేయాలని అమెరికా దాదాపు డిమాండ్ చేసింది. పాక్ ను బ్లాక్ లిస్టులో పెట్టే విషయమై గ్లోబల్ యాంటీ టెర్రరిస్ట్ వాచ్ డాగ్ అయిన ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా చేసిన ఈ సూచన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ లో లష్కరే-తోయిబా, జమాత్-ఉద్-దావా ఉగ్రవాద సంస్థలకు చెందిన నలుగురు టాప్ లీడర్ల అరెస్టు పట్ల యుఎస్ విదేశాంగ శాఖలోని దక్షిణ, సెంట్రల్ ఆసియా బ్యూరో చీఫ్ అలీస్ వెల్స్ హర్షం వ్యక్తం చేశారు. టెర్రరిజ కార్యకలా[పాల కోసం నిధులు సేకరిస్తున్నారన్న అభియోగంపై ప్రొఫెసర్ జాఫర్ ఎక్బాల్. యాహ్యా అజీజ్, మహమ్మద్ అష్రఫ్, అబ్దుల్ సలాం అనే ఈ నలుగురిని పాక్ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. ఇది హర్షణీయమేనని, లష్కరే నేత హఫీజ్ సయీద్ తో బాటు వీరిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని అలీస్ వెల్స్ కోరారు.

తమ దేశంలోని ఉగ్రవాదులను మొదట అరెస్టు చేయడం, ఆ తరువాత వారిని విడుదల చేయడం పాక్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్యారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ.. ఇక ఈ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చే విషయమై నిర్ణయం తీసుకోనుండగా.. పాక్ ఈ నలుగురిని అరెస్టు చేయడం, అమెరికా ఈ సూచన చేయడం విశేషం. గత ఏడాది జూన్ లో ఈ సంస్థ పాకిస్తాన్ ను ‘ గ్రే ‘ లిస్టులో చేర్చింది. 2019 అక్టోబరు నాటికి ఉగ్రవాదుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అప్పటికల్లా తెలియజేయాలని పాకిస్తాన్ కు ఈ సంస్థ అల్టిమేటం ఇచ్చింది. ఇరాన్, నార్త్ కొరియా ఇప్పటికే ఈ సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఇలాఉండగా.. హఫీజ్ సయీద్ పైన, ఐరాస ఉగ్రవాదులుగా ముద్ర వేసిన ఇతర టెర్రరిస్టులపైనా తీసుకున్న చర్యలకు సంబంధించి ఐరాస భద్రతా మండలి జారీ చేసిన తీర్మానాన్ని పాకిస్థాన్ అమలుచేయడంలో విఫలమైందని టాస్క్ ఫోర్స్ సంస్థ దుయ్యబట్టినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం ఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ ల సమావేశంలో తెలిపారు. దీంతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెరిగిందన్నారు.ప్రస్తుతం ప్యారిస్ లో ఈ సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశ పర్యవసానం ఎలా ఉంటుందో తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు.

Follow Us