AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: భార‌త్‌లో మంకీపాక్స్ అలర్ట్.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

Monkeypox: భార‌త్‌లో మంకీపాక్స్ అలర్ట్.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
Monkeypox
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2022 | 7:39 PM

Share

Monkeypox Virus: కరోనా మహమ్మారి పీడ పోకముందే.. మరో కొత్త వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అమెరికా, యూరప్, ఆఫ్రికన్ దేశాలలో భయాందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. మంకీపాక్స్ వ్యాధి నిర్వహణపై మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

  • కేంద్రమంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. వ్యాధి సోకిన సమయంలో రోగి లేదా వారి కాంటాక్ట్ ఉన్న పరిసరాల నుంచి 21 రోజుల పాటు దూరంగా ఉండాలని సూచించింది. కేసు పరిస్థితుల ప్రకారం.. లక్షణాలను.. రోగుల కాంటాక్ట్‌లను కనీసం ప్రతిరోజూ 21 రోజులపాటు పర్యవేక్షించాలని సూచించింది.
  • అన్ని క్లినికల్ నమూనాలను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ నెట్‌వర్క్ ద్వారా NIV పూణే అపెక్స్ లాబొరేటరీకి పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
  • కాగా.. భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులేమీ నమోదు కాలేదు. అయితే.. విదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గర్శకాలను జారీ చేసింది.

ఈ వైరస్ ఎలుకల నుంచి సోకిన జీవుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూకే, కెనడా, నైజీరియా, స్పెయిన్, పోర్చుగల్ లో కూడా మంకీపాక్స్‌ కేసులు బయట పడ్డాయి. అయితే.. ఈ మంకీపాక్స్‌ వైరస్‌ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు. దీని తీవ్రత వల్ల జ్వరం, అనారోగ్యం, సాధారణ ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కణాల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని ఇన్ఫెక్షన్‌ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే కలుషితమైన దుస్తులు, గాలి బిందువుల ద్వారా సంక్రమించే అవకాశముందని అమెరికన్ సీడీసీ, డబ్య్యూహెచ్ఓ పేర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..