కర్ణాటక సీఎం కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. కలెక్షన్ కింగ్ యతీంద్ర..!

సీఎం సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గ గృహ నిర్మాణ కార్యక్రమాల అవగాహన కమిటీ చైర్మన్‌గా డాక్టర్ యతీంద్ర నియమితులవ్వడం గమనార్హం. యతీంద్ర 2018లో ఇదే వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యతీంద్రకు టికెట్ నిరాకరించి తన తండ్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది.

కర్ణాటక సీఎం కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. కలెక్షన్ కింగ్ యతీంద్ర..!
Hd Kumaraswamy
Follow us
Narsimha

|

Updated on: Nov 16, 2023 | 12:00 PM

కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర అధికారుల బదిలీలకు సంబంధించి ముడుపులు పుచ్చుకున్నారంటూ కుమారస్వామి ఆరోపించడం సంచలనంగా మారింది. అందుకు సబంధించిన వీడియోను కుమారస్వామి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే వీడియోలోని చర్చ దేనికి సంబంధించిందో తెలియనప్పటికీ డాక్టర్ యతీంద్ర పోస్టింగ్ కోసం లంచం తీసుకున్నారంటూ మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. వరుణ మాజీ ఎమ్మెల్యే, సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.

అసలు వీడియోలో ఏం ఉందంటే.. మైసూరు జిల్లా కీలానాపురలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా యతీంద్ర తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు ఉన్న వీడియోను కుమారస్వామి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. నేను నాలుగైదు పేర్లు మాత్రమే ఇచ్చానని, మిగతా పేర్లు ఇవ్వలేదని తన తండ్రికి చెబుతున్నట్టు ఆ వీడియో సంభాషణలో విన్పిస్తోంది. అయితే ఈ సంభాషణ ఏం అంశానికి సంబంధించినది అన్న క్లారిటీ మాత్రం లేదు.

యతీంద్ర కర్ణాటక కలెక్షన్ కింగ్ అని, సీఎం కార్యాలయాన్ని దోపిడీ కార్యాలయంగా మార్చేశారని కుమారస్వామి ఆరోపించారు. ఇదిలావుంటే.. సీఎం సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గ గృహ నిర్మాణ కార్యక్రమాల అవగాహన కమిటీ చైర్మన్‌గా డాక్టర్ యతీంద్ర నియమితులవ్వడం గమనార్హం. యతీంద్ర 2018లో ఇదే వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యతీంద్రకు టికెట్ నిరాకరించి తన తండ్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి యతీంద్ర హౌజింగ్ కమిటీ చైర్మన్ హోదాలో తన తండ్రి నియోజకవర్గం పనులను చక్కబెడుతున్నారు.