TCS: టీసీఎస్ షాకింగ్ నిర్ణయం.. డైలామాలో 2వేల మంది ఉద్యోగులు
తాజాగా ప్రముఖ టీసీఎస్ సంస్థ 2వేల మంది ఉద్యోగులను ఉన్నట్టుండీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఐటీ ఉద్యోగులంతా డైలామాలో పడిపోయారు. ఏలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫళంగా ఇతర ప్రాంతలకు బదిలీ చేస్తే తాము, తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోతున్నారు.
TCS: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ తమ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వాస్తవానికి కరోనా మహమ్మారి దెబ్బకు ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యింది. దీంతో ఐటీ ఉద్యోగులంతా తమ కుటుంబాలకు సమీపంలో ఉంటూనే.. కొలువులు చేస్తూ వచ్చారు. కరోనా ఛాయలు మాయం కావడంతో ఐటీ కంపెనీలన్నీ దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేశాయి. ఇటీవల కాలం నుంచే తిరిగి ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయాలంటూ ఆదేశాలిస్తోంది. తాజాగా ప్రముఖ టీసీఎస్ సంస్థ 2వేల మంది ఉద్యోగులను ఉన్నట్టుండీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఐటీ ఉద్యోగులంతా డైలామాలో పడిపోయారు. ఏలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫళంగా ఇతర ప్రాంతలకు బదిలీ చేస్తే తాము, తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోతున్నారు. టీసీఎస్ మాత్రం 15 రోజుల్లో ఉద్యోగులు బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లి పనిచేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది.
ఆకస్మిక బదిలీలపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఐటీఈఎస్‌కు 180 మందికి పైగా టీసీఎస్ ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐటీ ఉద్యోగుల యూనియన్ టీసీఎస్ అనైతిక బదిలీలు చేసిందంటూ కేంద్ర కార్మిక, ఉద్యోగ కల్పన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ట్రాన్స్‌ఫర్ల వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రెజర్, టెన్షన్, కుటుంబ సభ్యుల మధ్య అంతరాయం ఏర్పడుతుందని యూనియన్ చెబుతోంది. కానీ టీసీఎస్ మాత్రం ఇవి సాధారణ బదిలీలేనంటూ చెప్పుకొస్తోంది. 2వేల మంది ఉద్యోగుల్లో అధిక శాతం మంది ప్రెషర్స్ ఉన్నారని, ప్రాజెక్టు నియామకం నేపథ్యంలో ఉద్యోగులను బదిలీ చేస్తున్నామే తప్ప.. ఎవరిపై ఏలాంటి ఒత్తిడి చేయడం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే.. తాజాగా బెంగళూరులోని టీసీఎస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. దీంతో టీసీఎస్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాండ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ గుర్తించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాల్ చేసిన వ్యక్తి టీసీఎస్ మాజీ ఉద్యోగిగా తేలింది.