AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Election: గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్ చేస్తే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..!

ఐదేళ్ల తర్వాత మాజీ ఎంపీ అశోక్‌ తన్వర్‌ కాంగ్రెస్‌లో చేరారు. మహేంద్రగఢ్ ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో తన్వర్ కాంగ్రెస్‌లో చేరారు. అతని ప్రధాన ప్రత్యర్థి భూపిందర్ సింగ్ హుడా కూడా అదే వేదికపై ఉండటం విశేషం.

Haryana Election: గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్ చేస్తే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..!
Ashok Tanwar
Balaraju Goud
|

Updated on: Oct 03, 2024 | 5:31 PM

Share

ఐదేళ్ల తర్వాత మాజీ ఎంపీ అశోక్‌ తన్వర్‌ కాంగ్రెస్‌లో చేరారు. మహేంద్రగఢ్ ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో తన్వర్ కాంగ్రెస్‌లో చేరారు. అతని ప్రధాన ప్రత్యర్థి భూపిందర్ సింగ్ హుడా కూడా అదే వేదికపై ఉండటం విశేషం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కాంగ్రెస్‌లో చేరడానికి గంట ముందు వరకు, అశోక్ తన్వర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

అశోక్ తన్వర్ మధ్యాహ్నం 12 గంటలకు నల్వాలో రణధీర్ పరిహార్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూ కనిపించారు. ప్రచారంలో ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేత కుల్దీప్ బిష్ణోయ్, రాజస్థాన్ మాజీ ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ఉన్నారు. ఈ సమయంలోనే మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన్వర్ అంతకుముందు జింద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ అభ్యర్థి రామ్‌కుమార్‌ గౌతమ్‌కు ఓటు వేయాలని ఆయన కోరారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో సిర్సా నుంచి అశోక్ తన్వర్‌ను బీజేపీ అభ్యర్థిగా చేసింది. అయితే, కాంగ్రెస్‌కు చెందిన కుమారి సెల్జా ఆయనను ఓడించారు. అశోక్ తన్వర్‌తో చేరడానికి ముందు సెల్జా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిశారు. సెల్జా, సోనియాల భేటీలో తన్వర్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. దీని తర్వాత తన్వర్ మహేంద్రగఢ్‌కు బయలుదేరారు.

అశోక్ తన్వార్ 2019కి ముందు హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్టీ అతని స్థానంలో సెల్జాకు అవకాశం కల్పించింది. దీంతో ఆగ్రహించిన తన్వర్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కొన్ని నెలలపాటు ఆప్‌లో ఉన్న తన్వర్ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే అక్కడ కూడా విజయం సాధించలేకపోయాడు. ఆ తర్వాత తన్వర్ బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని సిర్సా స్థానం నుంచి తన్వర్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే తాజాగా తన్వర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అందుకు ఆయనకు టిక్కెట్ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

NSUI నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అశోక్ తన్వర్ NSUI, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే నాయకులలో అశోక్ తన్వర్ ఒకప్పుడు ముఖ్యులు. 2009లో సిర్సా స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై తన్వర్‌ ఎంపీగా గెలుపొందారు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు తన్వర్‌ను హర్యానాకు పంపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..