Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Reunion: వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి… ఎక్కడంటే..

భర్త మరణించాడంటూ భార్య వితంతువుగా జీవిస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత మళ్లీ తాను జీవించి ఉన్నా అంటూ తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. దీంతో గ్రామస్థులు.. వీరిద్దరికీ శివయ్య సాక్షిగా మళ్ళీ పెళ్లి చేశారు.

Happy Reunion: వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి... ఎక్కడంటే..
Odisha Woman Marries 'dead'
Follow us
Surya Kala

|

Updated on: May 22, 2022 | 1:03 PM

Happy Reunion: తన భర్త ఓ ప్రమాదంలో మరణించడాని  భావించిన భార్య వితంతువుగా జీవితాన్ని గడుపుతుంది. మళ్ళీ రెండేళ్ల తర్వాత తాను బతికి ఉన్నా అంటూ.. ఆ భర్త తన కుటుంబ సభ్యుల ముందు ప్రత్యేక్షమయ్యాడు. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం తన భార్యని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన.. హ్యాపీ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కోరాపుట్‌​జిల్లా బోరిగుమ్మ బ్లాక్‌ పరిధిలోని పొడపడార్‌లో గత రెండేళ్లుగా చనిపోయినట్లు భావిస్తున్న ఓ స్థానికుడు సజీవంగా గ్రామానికి రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత వితంతువు జీవితం గడుపుతున్న ఆ వ్యక్తి భార్య హిందూ సంప్రదాయం ప్రకారం భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంది.

నివేదికల ప్రకారం.. ఘాసీ అమనాత్య అనే వ్యక్తి కొరాపుట్​ జిల్లాలోని పొడపాడర్​ గ్రామంలో నివసించేవాడు. అతనికి కొన్నేళ్ల క్రితం  సుబర్ణ  అనే మహిళతో వివాహం జరిగింది. అయితే ఘాసీ అమనాత్య మరికొందరు స్థానికులతో కలిసి పని వెతుక్కుంటూ రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లాడు. అతను మార్గమధ్యంలో అదృశ్యమయ్యాడు. అతని స్నేహితులు అతని కోసం చాలా రోజులు వెతికారు. కానీ ఫలించలేదు. ఎనిమిది నెలల తర్వాత, ఘాసి మరణించాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత, ఘాసీ కుటుంబ సభ్యులు , బంధువులు గ్రామంలో ఘాసీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పటి నుంచి భార్య సుబర్ణ వితంతువుగా జీవిస్తోంది.

అయితే రెండు నెలల క్రితం గ్రామంలో ఘాని సజీవంగా చూసి స్థానికులు అవాక్కయ్యారు. విచారణలో, ఆ వ్యక్తి పొరుగు రాష్ట్రంలో వలస కూలీగా పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని వివరించాడు. అనంతరం గ్రామసభ నిర్వహించి, సువర్ణ వితంతువుగా మారినందున.. వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిపించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో స్థానిక శివాలయంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఘాసీ తన భార్యను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..