AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌.. మరోసారి ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరల పెంపు..!

Airtel Prepaid Plans: గత సంవత్సరం వోడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధరలను..

Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌.. మరోసారి ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరల పెంపు..!
Subhash Goud
|

Updated on: May 22, 2022 | 1:26 PM

Share

Airtel Prepaid Plans: గత సంవత్సరం వోడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధరలను పెంచేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమవుతోంది. ఇలాంటి వార్తలను కంపెనీ సీఈవో గోపాల్‌ విట్టల్ (CEO Gopal Vittal) స్పష్టం చేశారు. 2022లో ఎయిర్‌టెల్‌ మళ్లీ ధరలను పెంచే ఆలోచనలో ఉందని, ఈ సారి ఒక్క వినియోగదారునికి సగటు ఆదాయం (ARPU) రూ.200గా నిర్ణయించబడుతుందని ఆయన వెల్లడించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 5G కోసం టెలికాం రెగ్యులేటర్ బేస్ ధరలతో ఎయిర్‌టెల్ సంతోషంగా లేదని అన్నారు. ధరలలో భారీ డిస్కౌంట్ కోసం ఇండస్ట్రీ ఆశించింది. తగ్గింపు ఉన్నప్పటికీ, అది తగినంతగా లేదు. ఆ కోణంలో నిరుత్సాహపరిచింది అని విట్టల్ తెలిపారు. గత సంవత్సరం మూడు ప్రైవేట్ యాజమాన్యాలైన టెలికాం ఆపరేటర్లు ప్లాన్ ధరలను దాదాపు 18 నుండి 25 శాతం పెంచారు.

గతేడాది నవంబర్‌లో ముందుగా టారిఫ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించగా.. వొడాఫోన్ ఐడియా, జియో కూడ ధరలను పెంచేశాయి. ఇప్పుడు కూడా చార్జీల పెంపును ముందుగా ఎయిర్ టెల్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్ మార్చిలో ఎక్కువ మంది 4G వినియోగదారులను ఆకర్షించింది (5.24 మిలియన్లు). ఇది మునుపటి మూడు నెలల వ్యవధిలో 3 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ అని విట్టల్ వెల్లడించారు. నవంబర్ 2021లో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను 18 నుండి 25 శాతం వరకు పెంచింది ఎయిర్‌టెల్. వోడాఫోన్ ఐడియా కూడా అదే శ్రేణిలో తన టారిఫ్‌లను సవరించింది. రిలయన్స్ జియో ధరలను 20 శాతం వరకు పెంచింది. ఇప్పుడు కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ మరింత భారం మోపనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి