LPG Gas Cylinder: రూ.369కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాంటి బుకింగ్‌, చిరునామా రుజువు అవసరం లేదు..!

LPG Gas Cylinder: దేశంలోని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలను 19న రూ.3.50 పెంచిన విషయం తెలిసిందే. ఎల్‌పీజీ ధరల పెంపు తర్వాత రాజధాని ..

LPG Gas Cylinder: రూ.369కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాంటి బుకింగ్‌, చిరునామా రుజువు అవసరం లేదు..!
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2022 | 9:37 AM

LPG Gas Cylinder: దేశంలోని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలను 19న రూ.3.50 పెంచిన విషయం తెలిసిందే. ఎల్‌పీజీ ధరల పెంపు తర్వాత రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర గతంలో రూ .999.50 గా ఉన్న ధర రూ.1003కి చేరింది. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌తో పాటు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.8 పెంచగా, ఆ తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2346 నుంచి రూ .2354కి పెరిగింది. అయితే మార్కెట్‌లో రూ.369 గ్యాస్ సిలిండర్ కూడా అందుబాటులో ఉంది. ఈ రూ.369 గ్యాస్ సిలిండర్‌కు ఎలాంటి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. దీనికి మీరు చిరునామా రుజువును అందించాల్సిన అవసరం లేదు.

వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా 14.2 కిలోలతో పాటు 5 కిలోలు, 10 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను విక్రయిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ LPGని ఇండేన్ పేరుతో విక్రయిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఇండేన్ ప్రస్తుతం 5, 10, 14.2, 19, 47.5 కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తోంది. వీటిలో 5, 10, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లు గృహావసరాలకు, 19, 47.5 కిలోల గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉన్నాయి.

ఛోటు గ్యాస్ సిలిండర్:

5 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.369 కాగా, 10 కిలోల సిలిండర్ ధర రూ.715. కంపెనీ తన 5 కిలోల గ్యాస్ సిలిండర్‌కు ‘ఛోటు’ అని పేరు పెట్టింది. దీనిని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, గ్యాస్ ఏజెన్సీతో పాటు సమీపంలోని కిరాణా దుకాణం నుండి కొనుగోలు చేయవచ్చు. 5 కిలోల గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేయడానికి మీరు ముందస్తుగా బుక్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి చిరునామా రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, చిన్న గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయడానికి, మీరు ఏదైనా ఒక గుర్తింపు రుజువును అందించాలి. ఛోటు గ్యాస్ సిలిండర్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని కోసం మీరు ఎలాంటి సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లి కొనుగోలు చేయవచ్చు.