Ola Electric Scooter: వాహనదారులకు షాకిచ్చిన ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత ప్రియం
Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయం పెరగడం లేదు గానీ.. ఖర్చులు మాత్రం ..

- Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయం పెరగడం లేదు గానీ.. ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా తడిసి మోపెడవుతోంది.
- ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. కంపెనీకి చెందిన ఎస్1 ప్రో ధరను రూ.10 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
- గత రెండు విడుతలుగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ.. మూడో విడుత మాత్రం ఎస్1 ప్రో మోడల్ ధరను పెంచేసింది. ధరలు పెంచడానికి గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
- దేశంలో ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1.40 లక్షలకు చేరుకొంది. గతంలో ఈ స్కూటర్ ధర రూ.1.30 లక్షలుగా ఉండేది. గతేడాది ఆగస్టులో ఈవీల విభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత ధరలు పెంచడం ఇదే మొదటిసారి.