Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోని వారికి షాకిచ్చిన ఆరోగ్య బృందాలు.. పెళ్లిలో ఎంజాయ్ చేస్తుండగా..
Ahmedabad Municipal Corporation: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. దీంతో కేంద్రం రాష్ట్రాలను
Ahmedabad Municipal Corporation: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. దీంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని చూడాలని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా చేపట్టాలని సూచనలు చేసింది. అంతేకాకుండా వైరస్‌ను అరికట్టేందుకు ప్రజలు సంచరించే ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా చెక్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శుభకార్యాలు జరిగే చోట, బస్టాండ్‌లల్లో, మాల్స్ తదితర చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వివాహ వేదికలో ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యక్షమై.. అందరికీ షాకిచ్చారు. వేడుకకు వచ్చినవారిలో ఎవరెవరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.. ఎవరు తీసుకోలేదని తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రెండు డోసులు తీసుకోని వారిని, అసలు వ్యాక్సిన్ డోస్ కూడా తీసుకోని వారిని గుర్తించి టీకా ఇచ్చారు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గురువారం జరిగింది.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వివాహ వేడుకలు జరుగుతున్న కమ్యూనిటీ హళ్లు, ఫంక్షన్ హాళ్లల్లో ఆరోగ్య కార్యకర్తలు తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. వ్యాక్సివేన్ వేసుకోని వారిని గుర్తించి మొత్తం 121 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇందులో వ్యాక్సిన్ వేసుకోనివారు కూడా ఉన్నారని.. వారందరికీ పలు సూచనలు చేసి.. అక్కడికక్కడే వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో మొత్తం 16 బృందాలు తనిఖీలు చేపట్టాయని వెల్లడించారు. ఇక నుంచి అన్ని పంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వెల్లడించారు.
కాగా.. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు 79,96,297 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Gujarat | Health Dept teams of Ahmedabad Municipal Corporation checks Covid-19 vaccine certificates & vaccinate people in marriage halls
“To complete the 2nd dose coverage, we’re checking certificates & vaccinating ppl here at the spot only,” says a health official (09.12) pic.twitter.com/jmfmVrGwA9
— ANI (@ANI) December 9, 2021
Also Read: