India Covid-19: కరోనా మృత్యుతాండవం.. దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసులు, మరణా సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే.. ప్రతిరోజూ
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసులు, మరణా సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే.. ప్రతిరోజూ 10వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే నిన్న కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశంలో 7,678 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 624 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 94,943 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744 కి చేరగా.. మరణాల సంఖ్య 4,74,735 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 7,678 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,41,05,066 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 131.18 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 65.32 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
????? ?????https://t.co/XYZhhl2bv5 pic.twitter.com/aQ1ZOigqFt
— Ministry of Health (@MoHFW_INDIA) December 10, 2021
ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశంలో 23 కేసులు నమోదయ్యాయి.
Also Read: