Bipin Rawat Helicopter Crash: మంటల్లో జవాన్లు.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన షాకింగ్ విషయాలు..!

Bipin Rawat Helicopter Crash: తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిన చోట భయంకర వాతావరణం కనిపించింది. మృతుల శరీర భాగాలు, హెలికాప్టర్‌ శకలాలు

Bipin Rawat Helicopter Crash: మంటల్లో జవాన్లు.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన షాకింగ్ విషయాలు..!
Bipin Rawat
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 10, 2021 | 9:57 AM

Bipin Rawat Helicopter Crash: తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిన చోట భయంకర వాతావరణం కనిపించింది. మృతుల శరీర భాగాలు, హెలికాప్టర్‌ శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుల దుస్థితిని చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ టీ తోటకు చాలా దగ్గరగా ఈ దుర్ఘటన జరిగింది. అది గమనించిన తోటలో పనిచేస్తున్న కూలీలు, చుట్టుపక్కలవారు ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే, ప్రమాదం జరిగిన తీరు, తర్వాతి పరిణామాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనిపించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్‌ చెట్లను ఢీకొడుతూ కూలిపోవడం చూశాం. ఆ వెంటనే పేలుడు సంభవించింది. హెలికాప్టర్‌ శిథిలాల నుంచి లేచిన ఓ వ్యక్తికి మంటలు అంటుకొని ఉన్నాయి. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతదూరం పరిగెత్తి ఆయన కుప్పకూలిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులూ కాలిపోతూనే పరిగెత్తేందుకు ప్రయత్నించినప్పటికీ.. పక్కనే పడిపోయారు. ఆ దృశ్యాలు భయానకంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి.. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హెలికాప్టర్‌లో ఉన్నట్లు మాకు తెలిసింది’’. అని చెప్పుకొచ్చారు.

బిపిన్ రావత్ నీళ్లు అడిగారు.. ఇదిలాఉంటే.. శివకుమార్ అనే మరో వ్యక్తి బిపిన్ రావత్ పరిస్థితిని వివరించాడు. ‘‘హెలికాప్టర్ శిధిలాలలో జనరల్ బిపిన్ రావత్‌ను సజీవంగా చూశాం. ఘటనా స్థలంలో మూడు మృతదేహాలు పడిపోయి ఉన్నాయి. ఇంతలో ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తి మంచినీళ్లు కావాలని అడిగారు. వెంటనే ఆయనను బెడ్‌షీట్‌లో చుట్టి కొండ కిందకు తీసుకువచ్చి రక్షణ దళాలకు అప్పగించాం. ఆ తరువాత మమ్మల్ని మంచినీళ్లు అడిగింది బిపిన్ రావత్ అని తెలిసింది. ఆ కాసేపటికే ఆయన చనిపోయారనే వార్త కూడా వచ్చింది.’’ అని శివకుమార్ చెప్పుకొచ్చాడు. కాగా, రావత్ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ రక్షణలో అత్యున్నత స్థానంలో నిలిచిన వ్యక్తికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయానని, నీళ్లు ఇచ్చి ఉంటే బతికే వారేమో అంటూ కన్నీరు కారుస్తూ గద్గధ స్వరంతో చెప్పుకొచ్చాడు.

Also read:

Credit Suisse: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు.. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ అంచనా..

Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..

Cheddi Gang: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ ఇదే.. వీరిని ఎప్పుడైనా గుర్తుపట్టారా..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..