Credit Suisse: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు.. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ అంచనా..

భారత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంగా ఉండవచ్చని స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ ఆశాభావం వ్యక్తం చేసింది...

Credit Suisse: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు.. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ అంచనా..
Economy
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 10, 2021 | 9:27 AM

భారత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంగా ఉండవచ్చని స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు దాదాపు 10.5 శాతంగా ఉంటుందని బ్రోకరేజ్ కంపెనీ అంచనా వేసింది. వివిధ ఏజెన్సీలు ఇచ్చిన సగటు అంచనా 8.4-9.5 శాతం కంటే ఇది ఎక్కువ.

కంపెనీ పాలసీకి అనుగుణంగా వాస్తవ ఆర్థిక వృద్ధిని అంచనా వేయడం లేదని క్రెడిట్ సూయిస్ చెప్పింది. అయితే, అందుబాటులో ఉన్న డేటా, అంచనాల గణాంక విశ్లేషణ ఆధారంగా, భారతదేశ వృద్ధి రేటు 2022-23లో 9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక పునరుద్ధరణ వేగం ఆశ్చర్యకరంగా ఉన్నందున జీడీపీ అంచనాలో పెరుగుదల ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆసియా పసిఫిక్, ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ అఫైర్స్ కోసం క్రెడిట్ సూయిస్ యొక్క కో-హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీలకంత్ మిశ్రా చెప్పారు. ‘‘ఆర్థిక వ్యవస్థలో సానుకూల కార్యకలాపాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. పునరుద్ధరణ ఇంకా సమగ్రంగా లేనప్పటికీ, చాలా తక్కువ-ఆదాయ ఉద్యోగాలు రాబోయే మూడు-ఆరు నెలల్లో పుంజుకునే అవకాశం ఉంది.

RBI అంచనా

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ గణాంకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ -7.4 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 20.1 శాతంగా ఉంది. 2021-22లో స్థిర ధరల వద్ద జీడీపీ రూ. 35.73 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు 2020-21 రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య రూ. 32.97 కోట్లుగా ఉంది. మరోవైపు, ఆర్‌బీఐ వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 9.5 శాతం వద్ద నిలుపుకుంది. అయితే సెంట్రల్ బ్యాంక్ 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి GDP వృద్ధి అంచనాను మునుపటి అంచనా 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. అదనంగా, ఆర్‌బీఐ 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.1 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది.

Read Also.. Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..