Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Petrol Diesel Rate Today: డిసెంబర్ 10, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ రూ. 86.67గా ఉంది.

Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Prices
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 10, 2021 | 9:11 AM

డిసెంబర్ 10, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ రూ. 86.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ ప్రస్తుతం లీటరుకు రూ. 109.98గా ఉంది. డీజిల్‌ లీటరుకు రూ. 94.14 చొప్పున విక్రయిస్తున్నారు. మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. VAT కారణంగా రాష్ట్రాలలో రేట్లు మారుతూ ఉంటాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62కు విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.90గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.25గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.13గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.74లకు లభిస్తోంది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా చమురు ధరలు తగ్గాయి. U.S. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 0.18 శాతం తగ్గి 70.81 డాలర్ల వద్ద ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.16 శాతం తగ్గి 74.30 డాలర్లకు చేరుకుంది

Read Also.. SBI customer alert!: మీరు ఎస్‎బీఐ ఖాతాదారులా.. అయితే ఓటీపీతో డబ్బు విత్‎డ్రా చేసుకోండిలా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!