Eve World: మహిళల కోసం ప్రత్యేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. భార్యను ట్రోల్ చేయడంతో పుట్టుకొచ్చిన కొత్త ఆలోచన..
భారత్‌లో మగువల కోసం ప్రత్యేకంగా ఓ సోషల్ మీడియా వేదికను రూపొందిస్తున్నారు. దానిపేరే 'ఈవ్ వరల్డ్'. దీనికి బిజినెస్ ప్రొఫెషనల్, Zee5, బిగ్ ఎఫ్‌ఎమ్‌లకు వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన తరుణ్ కటియాల్ నాయకత్వం వహిస్తున్నారు...
భారత్‌లో మగువల కోసం ప్రత్యేకంగా ఓ సోషల్ మీడియా వేదికను రూపొందిస్తున్నారు. దానిపేరే ‘ఈవ్ వరల్డ్’. దీనికి బిజినెస్ ప్రొఫెషనల్, Zee5, బిగ్ ఎఫ్‌ఎమ్‌లకు వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన తరుణ్ కటియాల్ నాయకత్వం వహిస్తున్నారు. కటియాల్ 2020 నుంచి ఇంటర్నెట్, సాంప్రదాయ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చాలా సన్నిహిత అనుభవాన్ని పొందిన తర్వాత, అపర్ణా ఆచారేకర్, రజనీల్ కుమార్‌లతో కలిసి ఈవ్ వరల్డ్ అనే కాన్సెప్ట్‌పై పని చేస్తున్నారు.
“నా భార్య.. మీడియా వెటరన్ మోనిషా సింగ్ కటియాల్ నిజంగా నిష్ణాతులైన మీడియా వ్యక్తి. ఆమెను వాట్సాప్‌లో ట్రోల్ చేయబడటం ప్రారంభించారు. ఎవరో ఆమె నంబర్‌ను సేకరించి ఇలా చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని భావించాం. అప్పుడు ఆమె నాకు చెప్పిన కారణం ఏమిటంటే, ‘నేను రిపోర్ట్ చేసినా, వారు ఆ వ్యక్తిని కనుగొన్నప్పటికీ అసలు అతనిపై తీసుకునే చర్యలు ఏమిటి? అని అడిగింది.” అని తరుణ్ కటియాల్ అన్నారు.
నలభై ఆరేళ్ల తరుణ్ కటియాల్ రెండు దశాబ్దాలకు పైగా మీడియా, వినోద రంగంలో ఉన్నారు. అతను స్టార్ ఇండియా, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ వంటి బ్రాండ్‌లలో టాప్ ఎగ్జిక్యూటివ్ పదవులను నిర్వహించాడు. ఈవ్ వరల్డ్ జూన్ 2021లో మొట్టమొదటిసారిగా మహిళలకు మాత్రమే సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ఇది మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి, కంటెంట్‌ని రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ప్రకారం, 2020లో ఆన్‌లైన్ వేధింపుల కేసులు దాదాపు ఐదు రెట్లు పెరిగాయని నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్‌పర్సన్ రేఖా శర్మ చెప్పారు. “అంతకుముందు, మేము ఆన్‌లైన్ వేధింపులపై 300 ఫిర్యాదులను నమోదు చేశాం. COVID-19 తర్వాత ఇది 1,500కి పెరిగింది ” అని ఆమె జనవరి 2021లో చెప్పారు.
2021, జూన్‌లో ఈవ్ వరల్డ్ కార్యరూపం దాల్చింది. సింగపూర్‌కు చెందిన జంగిల్ వెంచర్స్ ఇందులో పెట్టుబడి పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ తరహాలో ఈ సోషల్ మీడియా ఉంటుంది. మహిళలు ఇందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కంపెనీ ఉద్యోగుల్లోనూ 70 శాతం మంది మహిళలే ఉంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఈ వేదికను రూపొదిస్తుండటంతో మహిళా సాధికారతకూ కృషి చేస్తున్నారు. సభ్యులు తమ యాక్టివిటీ ద్వారా వర్చువల్ టోకెన్లు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించొచ్చు. తక్కువ ధరకే ఎన్‌ఎఫ్‌టీలను కొనుగోలు చేయొచ్చు. మైక్రో ఎంటర్‌ప్రిన్యూర్లు తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవచ్చు. దీంతో ఈ వేదిక ద్వారా ఆదాయం సృష్టించొచ్చు.
Read Also.. Knight Frank India report: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. లేకుంటే ధరలు పెరుగుతాయి..!