Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?

Night curfew in Gujarat: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ కొన్నిరాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ..

Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 16, 2021 | 1:32 AM

Night curfew in Gujarat: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ కొన్నిరాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది. గుజరాత్‌లోని కొన్ని మెట్రో నగరాల్లో గతేడాది దీపావళి నుంచి నైట్‌ కర్య్ఫూ అమలవుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌ మెట్రో నగరాల్లో కొనసాగుతున్న ఈ కర్ఫ్యూను గుజరాత్‌ ప్రభుత్వం తాజాగా పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు వరకు ఈ కర్ఫ్యూ అమలవుతుందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. అయితే ఈ నాలుగు నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలవుతున్న రాత్రి‌ కర్య్ఫూ సమయాన్ని ఒక గంట తగ్గించినట్లు తెలిపింది.

ఈ నెల చివరి వరకు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్‌ కర్య్ఫూ అమలవుతుందని తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు సోమవారం అర్థరాత్రి నుంచి అమలవుతాయని రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పంకజ్ కుమార్ వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ నాటినుంచి ఈ ప్రాంతాల్లో కర్య్ఫూను పొడిగించడం ఇది నాలుగవ సారి. కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్