85 లక్షలు దాటిన కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్య.. టీకా తీసుకున్న అనంతరం 35 మందే ఆసుపత్రుల్లో చేరారు: కేంద్రం

COVID-19 vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పొందిన లబ్ధిదారుల సంఖ్య..

85 లక్షలు దాటిన కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్య.. టీకా తీసుకున్న అనంతరం 35 మందే ఆసుపత్రుల్లో చేరారు: కేంద్రం
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 16, 2021 | 1:02 AM

COVID-19 vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పొందిన లబ్ధిదారుల సంఖ్య 85 లక్షలు దాటింది. సోమవారం నాటికి మొత్తంగా 85,16,385 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 61,54,894 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి తెలిపారు. ఈ ఆరోగ్య కార్యకర్తల్లో 60,57,162 మంది తొలి డోసును, 97,732 మంది రెండో డోసును పొందినట్లు పేర్కొన్నారు. సోమవారం 23,61,491 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేసినట్లు భండారి వెల్లడించారు.

ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు 35 మంది మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆసుపత్రుల్లో చేరారని మన్‌దీప్‌ భండారి తెలిపారు. వీరిలో 21 మంది డిశ్చార్జ్‌ కాగా ముగ్గురు చికిత్స పొందుతున్నారని మన్‌దీప్‌ తెలిపారు. గత 31 రోజుల్లో టీకా వేయించుకున్నవారిలో 11 మంది మరణించారని, అయితే వీరి మరణాలకు కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మన దేశంలో సున్నా కంటే తక్కువగానే ఉందని ఆయన వెల్లడించారు.

Also Read:

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!