Strain New Symptoms: కొత్త స్ట్రెయిన్ వైరస్ ఏడు కొత్త లక్షణాలు.. ఏ రెండు కనిపించినా జాగ్రత్తలు తప్పని సరంటున్న నిపుణులు
చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్ రోజు కో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో కరోనా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి... అవి కరోనా వైరస్ కంటే శక్తివంతమైనవని గత కొన్నాళ్లుగా..
Strain New Symptoms: చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్ రోజు కో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో కరోనా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి… అవి కరోనా వైరస్ కంటే శక్తివంతమైనవని గత కొన్నాళ్లుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కరోనా వైరస్ లక్షణాల జాబితా కూడా పెరుగుతూనే ఉంది.. ఇప్పటివరకూ సామాన్యానికి బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని జత చేరాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..!
జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం పాత స్ట్రెయిన్ లక్షణాలుగా ఉండేవి ఇప్పటివరకూ అయితే వీటితోపాటు.. ఒళ్ళు నొప్పులు, కండ్ల కలక, కళ్ళు ఎర్రగా మారడం, గొంతు మంట , శరీరంపై దద్దుర్లు, అతిసారం. తలనొప్పి, కాళ్ళు చేతులు పాలిపోయినట్లు కనిపించడం స్ట్రెయిట్ కొత్త లక్షణాలని నిపుణులు చెప్పారు.
వీటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవడం బెటర్ అని చెప్పారు. రిజల్ట్ వచ్చే వరకూ ఐసొలేట్ అవ్వడం మంచిదని బయటకు వెళ్లడం కూడా మానేయాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ అనితెలిస్తే.. తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తోపాటు జాగ్రత్తలు కూడా పాటించాల్సిందే…!
Also Read: