నా భార్యను హత్య చేశాను దానికి కారణం నేను కాదు కరోనా వైరస్ అంటున్న ఓ భర్త.. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలుసా..!

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యం. జీవన స్థితిగతులను మార్చేసింది.. అంతేకాదు మానసికంగా మనుషులను మరింత బలహీనులుగా మార్చి హంతకులను కూడా చేసింది అనడానికి ఉదాహరణగా నిలిచింది ఓ ఘటన.. యూకేలో కరోనా వైరస్ నివారణ కోసం...

నా భార్యను హత్య చేశాను దానికి కారణం నేను కాదు కరోనా వైరస్ అంటున్న ఓ భర్త.. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 16, 2021 | 11:27 AM

Covid19 Pandemic: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యం. జీవన స్థితిగతులను మార్చేసింది.. అంతేకాదు మానసికంగా మనుషులను మరింత బలహీనులుగా మార్చి హంతకులను కూడా చేసింది అనడానికి ఉదాహరణగా నిలిచింది ఓ ఘటన.. యూకేలో కరోనా వైరస్ నివారణ కోసం విధించిన లాక్ డౌన్ సమయంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేయగా.. తాజాగా స్వాన్సీ క్రౌన్ కోర్టు అతనిని నిర్దోషిగా సంచలన తీర్పు ఇచ్చింది, కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో భార్యను గొంతు కోసి హత్యచేసిన భర్త దోషి కాదని తేలింది. వివరాల్లోకి వెళ్తే..

టోర్పెన్ లోని క్వాంబ్రాన్ దేశంలో కోవిడ్ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన కొత్తలో 70ఏళ్ల ఆంథోనీ విలియమ్స్ తన భార్య రుత్ (67)తో గొడవపడ్డాడు. అనంతరం ఆ కోపంలో భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మార్చి 28న చోటు చేసుకుంది. ఈ హత్యకేసును స్వాన్సీ క్రౌన్ కోర్టులో ఐదు గంటల పాటు విచారణ జరిగింది. విలియమ్స్ లాక్ డౌన్ సమయసంలో చాలా రాత్రులు నిద్రపోలేదని.. కరోనా వైరస్, డబ్బు, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూనే ఉన్నాడని తెలిపింది. అంతేకాదు విలియమ్స్ తన భార్యను హత్య చేయడానికి ముందు కొన్ని వారాలుగా నిరాశ, ఆందోళనతో బాధపడ్డాడు. బెడ్ రూంలో జరిగిన గొడవ సమయంలో విలియమ్స్ తన భార్య రూత్ విలియమ్స్ ను హత్యచేసినట్టు అంగీకరించాడు. భార్యను హత్య చేసిన అనంతరం విలియమ్స్ పక్కంటి వారి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పనట్లు తెలిపాడు. వారికి హత్య విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పానని విచారణలో అంగీకరించారు.రక్తపు మడగులో పడిన భార్యరుత్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

అయితే తన భార్యను కావాలని హత్య చేయలేదని, పొరపాటున ఆవేశంలో అలా చేశానని, తాను ఎందుకు అలా క్రూరంగా ప్రవర్తించానో తనకే తెలియదని విలియమ్స్ చెప్పాడు. అంతేకాదు తాను కరోనా లాక్ డౌన్ తర్వాత మానసికంగా ఇబ్బంది పడుతున్నాని తెలిపాడు.

అయితే పోలీసుల విచారణలో భర్త తనపై దాడి చేసిన సమయంలో రుత్ భయంతో మెట్లవైపు పరిగెత్తినట్టు గుర్తించారు. మెట్లమీద నుంచి కిందపడడంతో నేక్ తో పాటు మూడు చోట్ల బోన్లు విరిగినట్లు చెప్పారు. గొంతు కోయడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయిందని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది.

ఈ కేసు విచారణ సమయంలో మానిసిక నిఫుణులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. దాడి సమయంలో అతడి మానసిక స్థితి సరిగ్గాలేదని చెప్పారు. యూకేలో విధించిన కఠినమైన కరోనావైరస్ ఆంక్షలతో ఆందోళన నిస్పృహ చెందాడని.. అనారోగ్యంతో విలియమ్స్ బాధపడినట్టు డాక్టర్ అలిసన్ విట్స్ కోర్టుకు చెప్పారు. స్వాన్సీ క్రౌన్ కోర్టులోని జ్యూరీ విలియమ్స్ హత్యకు పాల్పడినట్లు ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read:

  1. విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు, డాక్టర్ నవీన్ అరెస్ట్

  2.  ఢిల్లీ సింఘు, యూపీ ఘాజీపూర్ బోర్డర్స్ నుంచి ఇంటి ముఖం పడుతున్న రైతులు, ఇక ఆందోళన దేశవ్యాప్తం

Latest Articles