AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!

పూటుగా మద్యం తాగేవారికి మరో ముప్పు పొంచి ఉన్నట్టు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!
Balaraju Goud
|

Updated on: Feb 15, 2021 | 9:22 PM

Share

Changes in DNA : అతిగా మద్యం సేవిస్తున్నారా..? అయితే మీకో హెచ్చరిక..? పూటుగా మద్యం తాగేవారికి మరో ముప్పు పొంచి ఉన్నట్టు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మితిమీరి మద్యం తాగే వారి డీఎన్ఏలో మార్పులు సంతరించుకుంటాయని వారు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వారిలో తొలుత ‘ఆల్కహాల్ యూజ్ డిజార్డర్’ (ఏయూడీ) తలెత్తుతుందని, ఆ తర్వాత అది పురుషుల డీఎన్ఏలో మార్పులకు కారణమవుతుందని వార్నింగ్ ఇస్తన్నారు. పూటుగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ శాస్త్రవేత్తలు అతిగా మద్యం సేవించేవారి ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేశారు. వీరి పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్‌ యూజ్‌ డిజార్డర్‌’ తలెత్తుతుందని వారు చెప్పారు. దీనికి చికిత్స చేయడం కోసం వైద్యులు చాలావరకూ.. వారిని మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ ఈ అలవాటు పడిన పురుషుల డీఎన్‌ఏలో మార్పులు చోటుచేసుకున్నాయి. మద్యం మోతాదు తగ్గించుకున్న, పూర్తిగా మానేసిన సందర్భాల్లోనూ ఏయూడీతో వచ్చిన మార్పులు కనీసం మూడు నెలలు కొనసాగినట్లు వెల్లడైందని అధ్యయన బృందం వెల్లడించింది.

ముఖ్యంగా 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 52 మంది పురుషులపై ప్రయోగాల్లో నిర్వహించినట్లు అధ్యయన బృందం తెలిపింది. ఈ మేరకు పూర్తి నివేదికను వెల్లడించింది. ఏయూడీతో రుగ్మత కారణంగా డీఎన్‌ఏలో మిథైల్‌ గ్రూప్స్‌ వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి డీఎన్‌ఏలో మార్పులు కలిగిస్తాయని చెప్పారు. అయితే, జన్యుక్రమాన్ని మార్చబోవని వివరించారు.

ఏయూడీ వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో భారత్‌లో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసువారిలో 29 శాతం మంది మద్యాన్ని సేవిస్తారని అంచనా వేసింది. వీరిలో 12 శాతం మంది రోజూ మందు తాగుతారని, 41 శాతం మంది వారానికోసారి మద్యం సేవిస్తారని ని పరిశోధకులు తెలిపారు.

Read Also…  కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. వచ్చే రెండు మూడు వారాల్లో 50ఏళ్లు పైబడినవారికి టీకాః హర్షవర్ధన్