AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom : యాలకుల గురించి మీకు తెలుసా.. సువాసన కోసం మాత్రమే కాదు.. అసలు నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Cardamom:సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు ఓ ప్రత్యేకత ఉంది. దీని వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు. ఆధునిక జీవన

Cardamom : యాలకుల గురించి మీకు తెలుసా.. సువాసన కోసం మాత్రమే కాదు.. అసలు నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
uppula Raju
|

Updated on: Feb 15, 2021 | 7:11 PM

Share

Cardamom:సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు ఓ ప్రత్యేకత ఉంది. దీని వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు. ఆధునిక జీవన శైలిలో ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్న జనాలకు వీటి గురించి ఎక్కువగా తెలియదు. ఇవి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఎన్నో బాధలకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇవి భారత్‌తో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి. యాలకుల వల్ల కలిగే బెనిఫిట్స్‌ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొన్ని వంటకాల్లో మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటాం. సాధారణంగా మన వంటింట్లో ఉంటాయి. యాలకులు భారత్‌తో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలకుల్లో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను పొగొడుతుంది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి.

కొంతమంది బాధలను తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతోగానూ ఉపయోగపడుతాయి. ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆస్తమాను అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని రెగ్యులర్‌గా వాడుతుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి వాడతారు. యాలకులు డయాబెటిస్‌ను కొంత మేర అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Red Chilli Health Benefits: కారం తింటే దీర్ఘకాలిక వ్యాధుల నివారణ సహా రోగనిరోధక శక్తి పెంచుతుంది అంటున్న పరిశోధకులు