ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో లీస్ట్.. యాంటీజెన్ టెస్టుల్లో టాప్.. కరోనా గణాంకాల్లో తెలంగాణ పరిస్థితి..

దేశంలో కొవిడ్ టెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అతి తక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం లెక్కల ప్రకారం..

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో లీస్ట్.. యాంటీజెన్ టెస్టుల్లో టాప్.. కరోనా గణాంకాల్లో తెలంగాణ పరిస్థితి..
Follow us

|

Updated on: Feb 15, 2021 | 4:17 PM

దేశంలో కొవిడ్ టెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అతి తక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 9 నాటికి రాష్ట్రంలో మొత్తం 10,60,226 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు వెల్లడించింది. మొత్తం టెస్టుల్లో ఇది కేవలం 15.52 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా యాంటీజెన్ టెస్టుల్లో దేశంలో అత్యధిక స్థాయిలో నిర్వహించిన ఘనత తెలంగాణకే దక్కింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 84 శాతం మన దగ్గర రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసినట్లు కేంద్రం వివరించింది. కాగా చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా నిర్వహించారు. దేశంలో 98 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అక్కడ రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయలేదు.

ఇదిలా ఉంటే దేశంలో ఆయా రాష్ట్రాల్లో గతేడాది మే నుంచి జనవరి వరకు నమోదైన కరోనా పాజిటివ్ గణాంకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేట్ జనవరి మాసంలో ఒక శాతానికి పడిపోయినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగస్టు మాసం నుంచి కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. జనవరి మాసంలో కేవలం ఒక శాతమే పాజిటివ్ రేటు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో తొలి కరోనా కేసు గతాడేది జనవరి 30న నమోదు కాగా, తెలంగాణలో మార్చి 2న నమోదైంది. అనంతరం వైరస్ వ్యాప్తి పెరుగుతూ వచ్చింది. జూన్ నాటికి దేశంతో పాటు తెలంగాణలోనూ కేసులు భారీగా పెరిగాయి. ఆ తర్వాత నాలుగు మాసాల పాటు కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో జూన్‌లో 36.5 శాతం, జూలైలో 35.2 శాతం పాజిటివ్ రేటు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

India vs England 2nd Test: రెండో ఇన్నింగ్స్‌లో ముగిసిన భారత్ పోరాటం.. 286 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 482 పరుగులు..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ