Crime: సినిమా చూసి సొంత బామ్మనే చంపేశాడు.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు
సినిమాల (Cinema) ప్రభావం సమాజంపై ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇష్టమైన హీరో మందు కొట్టాడని, సిగరెట్ కాల్చాడని, అమ్మాయిలకు లైన్ వేశాడని అభిమానులు, యువత కూడా అదే విధంగా చేస్తున్నారు. హీరో ఏం చేసినా..

సినిమాల (Cinema) ప్రభావం సమాజంపై ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇష్టమైన హీరో మందు కొట్టాడని, సిగరెట్ కాల్చాడని, అమ్మాయిలకు లైన్ వేశాడని అభిమానులు, యువత కూడా అదే విధంగా చేస్తున్నారు. హీరో ఏం చేసినా దానిని యాసిటీస్ గా ఫాలో అయిపోతున్నారు. సినిమా అనేది కల్పితం అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఎఫెక్ట్ తో కొన్ని సార్లు దొంగతనాలు, మరికొన్ని సార్లు వేధింపులు, రేర్ గా హత్యలు, దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలను మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. నానమ్మ ఆస్తిపై కన్నేసిన మనుమడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలే పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు (Pune) పెట్టాడు. అతని వ్యవహారంపై పోలీసులకు డౌట్ వచ్చింది. అతననిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. సినిమాలు చూసే ఈ హత్య చేసినట్లు అతను చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. మహారాష్ట్ర పుణెలోని కేశవ్‌నగర్‌లో నివాసముండే ఉషా విఠల్ గైక్వాడ్ దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంప్‌లో విధులు నిర్వర్తించారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమె కేశవనగర్‌లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కుమారుడు, కోడలు, మనవడు,మనమరాళ్లు ఉండేవారు. అయితే కొద్ది రోజులుగా అత్తాకోడళ్ల మధ్య తరచూ ఘర్షణ జరుగుతుండేది. ఈ క్రమంలోనే ఆగస్టు 5 న మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోడలు ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయింది.
పరిస్థితిని గమనిస్తున్న మనుమడు సాహిల్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉష నిద్రపోతుండగా ఆమెపై దాడి చేశాడు. బాత్రూంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని కటర్‌తో ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. శరీరాన్ని 9 భాగాలు చేసి సంచుల్లో వేశాడు. వాటిని తీసుకుని నది వద్దకు వెళ్లాడు. నీటిలో పడేశాడు. మరో బ్యాగ్ ను వేరే చోట, కత్తి, దుస్తులను మజ్రీ నది ఒడ్డున వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సాహిల్ ను మందలించారు. ఈ నేరం నుంచి ఎలాగైనా అతడిని తప్పించాలనే ఉద్దేశ్యంతో కొత్త డ్రామాకు తెర లేపారు. ఉష కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ఇచ్చారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఉష కూతురికి ఆమె అన్నపై అనుమానం రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఉష మనుమడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది.
సాహిల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నానమ్మ ఆస్తి తనకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. ఓ మలయాళీ రీమేక్ సినిమా చూసాకే తనకు చంపాలన్న ఆలోచన వచ్చిందని తెలపడంతో పోలీసులు అవాక్కయ్యారు. కాగా.. సాహిల్ గ్రాఫిక్డిజైనర్ గా పని చేస్తున్నాడు. యూ ట్యూబ్‌లో క్రైమ్‌కు సంబంధించిన సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం



