Viral: ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు.. అవి కావాలని నేరుగా సీఎం హెల్ప్ లైన్ కు ఫోన్

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ విచిత్ర సంఘటన జరిగింది. సమస్యలను పరిష్కరించాలనో, సహాయం చేయాలనో వేడుకుంటూ సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తుంటారు. వీటిపై ముఖ్యమంత్రి స్పందించి వారికి సహాయం చేస్తారని బాధితులు...

Viral: ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు.. అవి కావాలని నేరుగా సీఎం హెల్ప్ లైన్ కు ఫోన్
phone call
Follow us

|

Updated on: Sep 07, 2022 | 5:18 PM

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ విచిత్ర సంఘటన జరిగింది. సమస్యలను పరిష్కరించాలనో, సహాయం చేయాలనో వేడుకుంటూ సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తుంటారు. వీటిపై ముఖ్యమంత్రి స్పందించి వారికి సహాయం చేస్తారని బాధితులు భావిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి చేసిన పని నవ్వులు పూయించడంతో పాటు కోపం కూడా తెప్పిస్తోంది. ఎందుకంటే ఆతను సీఎం హెల్ప్ లైన్ (CM Help Line) కు ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలిస్తే మీరూ ఇలాగే ఉంటారు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తనకు ఒక ప్లేటు, స్పూను కావాలని, వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాడు. అందుకు సీఎం హెల్ప్‌లైన్‌ కూడా అంగీకరించింది. ఆ తర్వాత అతని ఫిర్యాదును రద్దు చేసింది. అసలు విషయం ఏంటంటే… మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఛతర్‌పూర్‌ బస్టాండ్‌లోని ఓ సమోసా సెంటర్‌కు వెళ్లి సమోసా పార్శిల్‌ కావాలని అడిగాడు. ఆ దుకాణదారుడు సమోసా ప్యాక్‌ చేసి అతనికి ఇచ్చాడు. ఆ పార్శిల్‌తో పాటు ఓ ప్లేటు, స్పూను కూడా ఇవ్వాలి, కానీ అతను ఇవ్వలేదు. దాంతో ఆ వ్యక్తి పార్సిల్‌తోపాటు ప్లేట్‌, స్పూన్ కావాల‌ని దుకాణదారుడిని కోరాడు. దీనికి స‌మోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాక‌రించాడు. అంతేకాదు పార్శిల్‌కి వాటిని ఇవ్వమని చెప్పాడు.

ఈ ఘటనతో కస్టమర్‌కు కోపం వచ్చింది. వెంటనే సీఎం హెల్ప్‌లైన్‌కు డ‌య‌ల్ చేసి, ఫిర్యాదు చేశాడు. అందులో దయచేసి వీలైనంత త్వరగా తన సమస్యను పరిష్కరించాల‌ని కోరాడు. ఆగస్టు 30న ఈ ఫిర్యాదు చేయ‌గా, సీఎం హెల్ప్‌లైన్ కూడా ఆ ఫిర్యాదును అంగీకరించింది. అయితే, సెప్టెంబర్ 5న ఈ ఫిర్యాదును రద్దు చేశారు. ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఐదు రోజులకు పైగా దాఖలయ్యిందని, దానిపైన మేధోమథనం చేసిన తర్వాతే దాన్ని క్లోజ్ చేసిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. కాగా, ఈ వార్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి