Konaseema: కోస్తే 2 ముక్కలు కూడా కాదు.. ఈ చిన్న పులస ధర ఎంతో తెలిస్తే షాకే
సరిగ్గా చేయి తిరిగిన వాళ్లు పులసను వండాలి కానీ... తిన్న తర్వాత ప్లేటును కూడా నాకేస్తారు. పులస పులుసు స్మెల్ రాగానే నోట్లో నీళ్లూరుతాయి.
Andhra Famous Fish: పుస్తెలమ్మయినా సరే పులస తినాలి అనేది నానుడి. ఈ చేపకు ఉండే క్రేజ్ అలాంటింది మరి. సముద్రం నుంచి గోదావరిలో ఎదురీది ఇలస పులసగా మారుతుంది. గోదావరి తీరాల్లో ఇప్పుడు పులసలు దొరికే సీజన్. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చేపను దక్కించుకునేందుకు వస్తున్నారు. కానీ ఎందుకో తెలీదు కానీ ఈసారి పులసలు పెద్దగా దొరకడం లేదు. దొరికినవి కూడా పెద్ద సైజ్ ఉండటం లేదు. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం(P.Gannavaram) చేపల మార్కెట్లోకి ఓ చిన్న పులస వచ్చింది. గట్టిగా చెప్పాలంటే అది జానెడు కూడా లేదు. పావు కేజీ కూడా ఉండదు. లోపల జన తీసేసి కోస్తే సరైన ముక్కలు 2 కూడా కాదు. కానీ ఆ చిన్న పులసకు కూడా రూ.900 రేటు పలికింది. పులస అంటే అట్టాగుంటది మరి. అయితే కస్టమర్స్‌కు అలెర్ట్ ఏంటంటే.. పులస పెద్దగా దొరకడం లేదు కాబట్టి.. ఇలసనే.. పులస అని చెప్పి అమ్మేస్తున్నారు కొందరు. అవగాహన లేకుంటే హాంఫట్ అంతే. అందుకే పులసను కొనడానికి వెళ్తే.. కాస్త తెలిసినవారిని తీసుకెళ్లండి. కాగా కేజీన్నర నుంచి 2 కేజీల మధ్య ఉండే పులసలు దాదాపు రూ.20 వేల వరకు రేటు పలుకుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..