AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: ఆ రెండింటి వల్లే నా తండ్రిని కోల్పోయా.. భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. ప్రజలకు పార్టీని దగ్గరచేసేందుకు యువనేత రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో..

Bharat Jodo Yatra: ఆ రెండింటి వల్లే నా తండ్రిని కోల్పోయా.. భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Tributes To Rajiv Gan
Amarnadh Daneti
|

Updated on: Sep 07, 2022 | 3:09 PM

Share

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. ప్రజలకు పార్టీని దగ్గరచేసేందుకు యువనేత రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈయాత్ర ప్రారంభంకానుంది. సుదీర్థ పాదయాత్ర ప్రారంభానికి ముందు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి , మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. . మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం తన తండ్రి జ్ఞాపకార్థం శ్రీపెరంబుదూర్ లో జరిగిన ప్రార్థనలోపాల్గొన్నారు. 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూర్‌లో ఆత్మాహుతి బాంబు దాడిలో రాజీవ్ గాంధీ హత్య చేయబడిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ.. యాత్ర ప్రారంభానికి ముందు తన తండ్రి స్మారకాన్ని సందర్శించిన అనంతరం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

విధ్వేష, విభజన రాజకీయాల వల్ల తన తండ్రిని కోల్పోయానని, మళ్లీ అవే విభజన, విద్వేష రాజకీయాల కారణంగా తన దేశం విడిపోకుండా చూసుకుంటానంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన తండ్రిని కోల్పోయినప్పటికి.. తన ప్రియమైన దేశాన్ని రక్షించుకుంటానని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలా ఉండగా శ్రీపెరంబుదూర్ నుంచి రాహుల్ గాంధీ కన్యాకుమారి చేరుకున్నారు. మరి కాసేపట్లో తమిళనాడు సీఏం స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్ గాంధీకి అందజేయడంతో భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..