Khairatabad Ganesh: ఈ సారి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అక్కడే.. ఊరేగింపునకు సర్వం సిద్ధం..
హైదరాబాద్ (Hyderabad) లో గణేశ్ ఉత్సవాలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశ్. ఒక అడుగు, రెండు అడుగులు కాదండోయ్.. ఈ సారి 50 అడుగులకు పెరిగిపోయాడు లంబోదరుడు. ఇక చవితి నుంచి పూజలందుకుంటున్న..
హైదరాబాద్ (Hyderabad) లో గణేశ్ ఉత్సవాలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశ్. ఒక అడుగు, రెండు అడుగులు కాదండోయ్.. ఈ సారి 50 అడుగులకు పెరిగిపోయాడు లంబోదరుడు. ఇక చవితి నుంచి పూజలందుకుంటున్న గణపయ్య ఇక నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపునకు అంతా సిద్ధమైంది. ఊరేగింపు కోసం భారీ ట్రక్ ఏర్పాటు చేశారు. విగ్రహం జరగకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. కేవలం ఇంకొక్క రోజు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ రోజుకు కూడా ఎంతో మంది ప్రముఖులు, వీఐపీలు ఖైరతాబాద్ (Khairatabad) వినాయకుని దర్శించుకున్నారు. అంత భారీ మట్టి వినాయకుడు అంటే సాధారణంగా ఉన్నచోట నిమజ్జనం చేసేస్తారని అనుకుంటాం కానీ ఖైరతాబాద్ వినాయకుడుని శోభాయాత్రతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. ఏటా హైదరాబాద్ లో జరిగే గణేశ్ శోభాయాత్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1954 లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ సాగుతోంది. మొత్తం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం 60 అడుగులకు చేరిన తర్వాత 2014లో షష్టిపూర్తి మహోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత మళ్లీ ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం 50 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో లడ్డూ పంపిణీలో జరిగిన తొక్కిసలాట కారణంగా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తగా విగ్రహం చేతిలో బొమ్మ లడ్డును పెట్టారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా ఉత్సవాలు జరలేదు. ఈ సారి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శుభం జరగాలనే ఉద్దేశ్యంతో పంచముఖ మహాలక్ష్మి గణపతిని పూజించి గణేశ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభఇంచారు. జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక నీటి పాండ్ లను ఏర్పాటు చేస్తోంది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..