Tulsi Puja: తులసి పూజ ఎలా చేయాలి?.. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ మంత్రం చెప్పాలో తెలుసుకోండి

తులసి మొక్క శ్వాస కోరకు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోను పూజ చేయండి. ఈ మంత్రంను జపించండి..

Tulsi Puja: తులసి పూజ ఎలా చేయాలి?.. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ మంత్రం చెప్పాలో తెలుసుకోండి
Tulasi Puja
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 07, 2022 | 7:50 PM

తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు భారతీయ పురాణాల్లోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణన సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తలసిని పూజిస్తారు. హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను ఉంటుంది. ఉదయం, సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. తులసిని లక్ష్మీ దేవి ప్రతి రూపంగా కొలుస్తారు. తులసిని భక్తితో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు. తులసి అమ్మవారికి పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. 

తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థంను సర్వరోగ నివారణిగా భావిస్తారు. తులసి 24 గంటలూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమమ్ టెన్యూయి ఫ్లోరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు. నిత్యం తులసి పూజ చేసి.. మొక్కకు నీరు పోయాలి. ఇలా తులసికి పూచేస్తే లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది. వ్యక్తి సంపద, ఆహారాన్ని పొందుతాడు. తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి. తులసి పరిక్రమ నియమాలు, ఈ సమయంలో ఏ మంత్రాన్ని జపించాలో తెలుసుకుందాం. 

తులసి పరిక్రమ నియమాలు

శాస్త్రాల ప్రకారం, తులసికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అయితే తులసి పూజ చేయాలంటే మాత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న ఆ తర్వాత తులసికి నీళ్ళు పోయాలి. 

తులసి మొక్కు నీరు పోసిన తరువాత దానికి ప్రదక్షిణలు చేయాలి. తులసి ప్రదక్షిణ మూడు సార్లు చేయండి. అటువంటి పరిస్థితిలో మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నీటిని పోయాలి. 

మీ ఇంట్లో ప్రదక్షిణలు చేయడానికి స్థలం లేకుంటే లేదా ప్రదక్షిణలు చేయలేని చోట మొక్క నాటితే మీరు ఉన్న స్థానంలోనే నిలబడి మూడుసార్లు నడవవచ్చు. 

తులసికి నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణ చేయండి. అలాగే ఈ మంత్రాన్ని జపించాలి. నియమానుసారంగా పూజిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా ఉంటాయి. 

ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాలు..

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే! నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే! బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ! పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసి మొక్క మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. తులసి మొక్క శ్వాస కోరకు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోను పూజ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం