Privatization of Banks: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు రెడీ.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం..
ప్రభుత్వం త్వరలో బ్యాంకింగ్ (సవరణ) బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు కేబినెట్ నుంచి ఆమోదం పొందడం దాదాపు ఖాయం. దీనిపై వచ్చే వారం పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
Privatization of Banks: ప్రభుత్వం త్వరలో బ్యాంకింగ్ (సవరణ) బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు కేబినెట్ నుంచి ఆమోదం పొందడం దాదాపు ఖాయం. దీనిపై వచ్చే వారం పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
ఇందులో, బ్యాంకింగ్‌కు సంబంధించిన రెండు చట్టాల్లో మార్పులు జరుగుతాయి. దీని ద్వారా ప్రభుత్వం తన వాటాను విక్రయించవచ్చు. వచ్చే వారం బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చట్టాల్లో మార్పులకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత పార్లమెంటు టేబుల్‌పై ఉంచుతారు. అదేవిధంగా ప్రస్తుత సెషన్‌లో దీనిని ఆమోదించే ప్రణాళిక ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రక్రియ ప్రారంభించాలని..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, పార్లమెంటు నుంచి ఆమోదం పొందడం, ఆసక్తి వ్యక్తీకరణ జారీ చేయడం, ఆర్‌ఎఫ్‌పీ జారీ చేయడం, ఈ ప్రక్రియలు జరగాలి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి వచ్చే ఏడాది వరకు సమయం పట్టినా మొత్తం ప్రక్రియ ఈ ఏడాదే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
ప్రైవేటీకరించనున్న ఈ రెండు బ్యాంకుల పేర్లను ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది. అందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రధాన బ్యాంక్. దీనితో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా ఉంది. సెషన్‌లో ప్రవేశపెట్టే 26 బిల్లులలో ఈ బిల్లు కూడా ఒకటి.
ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రైవేటీకరణను ప్రకటించింది
ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ మరియు ప్రైవేటీకరణ కోసం రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతోపాటు ఎల్‌ఐసీ ఐపీఓను కూడా తీసుకువస్తామని ప్రకటించారు. అలాగే బీపీసీఎల్‌లో వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం నిధులు సేకరిస్తుంది.
మరోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని అంటున్నారు. ప్రభుత్వం ప్రయివేటీకరించినట్లయితే, ప్రాధాన్యతా రంగానికి సులభంగా రుణాలు లభించవని ఆమె అంటున్నారు.
ఇవి కూడా చదవండి: Indian Railways: ఇక రైళ్లలో ప్రయాణిస్తే.. విమానం తరహా సదుపాయాలు.. ప్రయాణీకులను పలకరించనున్న హోస్టెస్‌లు!
Fine on Amazon: ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే..
LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!