Google 2024 Search Trends: అక్కడ కూడా పవన్ కల్యాణ్ తోపు.. గూగుల్‌ 2024 ట్రెండ్స్‌ ఇవే..

గూగుల్.. గూగుల్.. గూగుల్.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే.. మనకు ఏం తెలియకపోయినా.. ఏదైనా విషయంపై పూర్తి అవగాహన రావాలన్నా.. పూర్తి సమాచారం కావాలన్నా.. గూగుల్ నే అడుగుతాం.. అందుకే.. గూగుల్ ఉండంగా.. టెన్షన్ ఎందుకు దండగా అంటుంటారు..

Google 2024 Search Trends: అక్కడ కూడా పవన్ కల్యాణ్ తోపు.. గూగుల్‌ 2024 ట్రెండ్స్‌ ఇవే..
Google 2024 Search Trends
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 10, 2024 | 8:11 PM

గూగుల్.. గూగుల్.. గూగుల్.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే.. మనకు ఏం తెలియకపోయినా.. ఏదైనా విషయంపై పూర్తి అవగాహన రావాలన్నా.. పూర్తి సమాచారం కావాలన్నా.. గూగుల్ నే అడుగుతాం.. అందుకే.. గూగుల్ ఉండంగా.. టెన్షన్ ఎందుకు దండగా అంటుంటారు.. టాప్ సినిమా ఏది..? పాట ఏది.. అక్కడి నేత ఎవరు..? మ్యాచ్ ఏమైంది.. పదాల అర్థం ఏంటి..? మనం చెప్పింది కరెక్టేనా..? ఇలా ఏ విషయం అయినా.. ఏ పని గురించైనా.. ఇలా గూగుల్ ని అడిగితే చాలు.. ఇట్టే చెప్పేస్తుంది.. అందుకే.. గూగుల్‌లో నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం… ఇలా ఏ సమాచారం తెలుసుకోవడానికైనా మనం మొదట ఆధారపడేది గూగుల్‌ పైనే.. అని మనందరికీ తెలుసు.. అయితే.. మరి ఈ ఏడాది-2024 పొడవునా మన భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారో తెలుసా? తెలియకపోతే.. ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది దేన్నంటే.. క్రికెట్‌ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL).. గూగుల్‌ ఓవరాల్‌ జాబితాలో ఈ ఐపీఎల్ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ (Google 2024 search trends) మంగళవారం ప్రచురించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల గురించి అత్యధిక మంది సెర్చ్ చేసిన జాబితాలో పవన్ కల్యాణ్ కు చోటుదక్కింది.

Pawan Kalyan Google

Pawan Kalyan Google

ఈ ఏడాది అత్యధికంగా వెతికన వాటిల్లో ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు.. ఇక సినిమాల విషయానికొస్తే స్త్రీ2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా.. ప్రభాస్‌ నటించిన కల్కి, సలార్‌ గురించి ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. వీటితో పాటు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్‌ మూవీ కూడా ఉంది.. ఇంకా.. హీరామండీ, మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ ల గురించి కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్‌ చేసినట్లు పేర్కొంది.

Google Search

Google Search

రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్‌ ఫొగాట్‌ గురించి కూడా ఎక్కువ మంది వెతికారని గూగుల్‌ తన నివేదికలో తెలిపింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన.. వ్యక్తుల జాబితాలో వినేశ్ ఫొగాట్ అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాశ్వాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా టాప్‌ సెర్చ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల జాబితాలో ఆయన ఐదో స్థానంలో నిలిచినట్లు గూగుల్ తెలిపింది.. ఇవే కాకుండా ఎక్కువగా సెర్చ్‌ చేసిన మీమ్స్‌, పదాల అర్థాలు, దగ్గర్లోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, బెస్ట్ వంటలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను విడుదల చేసింది.

గూగుల్ 2024 టాప్ సెర్చ్ ట్రెండ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..