AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనస్ 9 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత.. మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు

శీతాకాలం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్‌తో పాటు లడఖ్‌లో కూడా ఉష్ణోగ్రత మైనస్ 9 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు విపరీతమైన మంచు కురుస్తోంది. పర్యాటక ప్రదేశాల్లో మంచు కురుస్తుండడంతో ఆస్వాదించేందుకు పర్యాటకుల పోటెత్తుతున్నారు. దీంతో నిత్యం రద్దీ పెరుగుతోంది.

మైనస్ 9 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత.. మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు
Viral Video
Surya Kala
|

Updated on: Dec 10, 2024 | 7:36 PM

Share

శీతాకాలం జమ్మూ కశ్మీర్‌తో పాటు లడఖ్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోతున్నాయి. జమ్మూ, కశ్మీర్ వాతావరణ విభాగం ప్రకారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 9 డిగ్రీలకు చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో నీరు గడ్డ కట్టింది. పైపుల్లో నీరు పేరుకుపోయింది.

కశ్మీర్‌లో మరో 10 రోజులు పొడి వాతావరణం

కశ్మీర్‌లో చలికాలం పెరుగుతోంది. రానున్న 10 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉంటుంది. రానున్న రోజుల్లో చలి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. లోయలో కురుస్తున్న మంచును చూసి పర్యాటకులు ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పర్యాటక ప్రదేశంలో విపరీతమైన రద్దీ

గుల్‌మార్గ్‌, పహల్‌గామ్‌, సోనామార్గ్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఈ ప్రదేశాలలో పర్యాటకులు మంచును ఆస్వాదిస్తున్నారు. గుల్‌మార్గ్‌లో కురిసే మంచు వర్షంతో అక్కడ రెండు అంగుళాలు మేర మంచు పేరుకుంది. కొంగ్డోరిలో అనేక అంగుళాల మందపాటి మంచు ఉంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

మంచు కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం

హిమపాతం కారణంగా లడఖ్‌ను జమ్మూ కాశ్మీర్‌ను కలిపే రహదారులను మూసివేశారు. మొఘల్‌ రోడ్డు, సింథాన్‌ రోడ్లు కూడా వాహనాల రాకపోకలను మూసివేశారు. రోడ్లను శుభ్రం చేసేందుకు పోలీసులు యంత్రాలను, కార్మికులను మోహరించారు.

డిసెంబరు 12 నుంచి 13 మధ్య మళ్లీ భారీ మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు కురుస్తున్న హిమపాతాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులతో అక్కడ పర్యాటక రంగంలో ఆనందం నెలకొంది. చలికాలం పర్యాటక రంగానికి మంచి ఉత్సాహాన్ని తీసుకుని వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్