Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ రెమెడీస్..

కొందరికి నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారు తమ విశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాదు ఇతరులతో మాట్లాడాలన్నా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడేవారు సమస్య నుంచి ఉపశమనం కోసం కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించవచ్చు. ఈ రోజు ఆ చర్యల గురించి తెలుసుకుందాం..

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ రెమెడీస్..
Bad Breath
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2024 | 7:14 PM

నోటి దుర్వాసన ఇబ్బందికి కారణం అవుతుంది. నోటి దుర్వాసనతో బాధపడే వారు ఎవరితోనైనా మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అంతేకాదు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అయితే శ్వాసను తాజాగా ఉంచడానికి మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. ఈ రోజు కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం.. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే.. ఈ చిట్కాలు ఉపయోగించి నోటి దుర్వాసనను తొలగించుకోవచ్చు.

సోంపు, యాలకులు: రోజుకు రెండుసార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే సోపు లేదా యాలకులను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఆహారం తిన్న తర్వాత సోంపు లేదా యాలకులను తినాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన రాదు. సోంపు, యాలకులు సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి.

పుదీనా ఆకులు: నోటి దుర్వాసనకు పుదీనా చాలా మేలు చేస్తుంది. సొంపు, యాలకుల వలనే పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలాలి. ఇది నోటి నుంచి వచ్చే చెడు వాసనను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

లవంగాలు: నోటి దుర్వాసనను తొలగించడంలో లవంగాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగాలు తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి.

ఆపిల్ తినండి: యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు నోటి దుర్వాసనను తొలగించడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నోటిలో ఒక చిన్న యాపిల్ ముక్కను ఉంచుకోవాలి. ఇది నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది నోటి నుంచి దుర్వాసనను తొలగిస్తుంది.

దానిమ్మ తొక్కలు: దానిమ్మ గింజలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అదే సముయంలో దానిమ్మ తొక్క తో కూడా చాలా ఉపయోగాలున్నాయి. నోటి దుర్వాసనను తొలగించడానికి మీరు దానిమ్మ తొక్క ను మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి ఉడకబెట్టి.. ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వలన నోటి దుర్వాసన పోతుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)