AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలు.. కీలక ప్రకటన చేసిన మోడీ సర్కార్..

PM Modi: మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వనుందని మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలను సమీక్షించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో మిషన్‌ మోడ్‌లో పది లక్షల మందిని నియమించాలని..

Good News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలు.. కీలక ప్రకటన చేసిన మోడీ సర్కార్..
Modi
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2022 | 1:40 PM

Share

PM Modi Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది మోడీ సర్కార్. వందలు.. వేలు కాదు ఏకంగా లక్షల ఉద్యోగాకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. తాజాగా ఏడాదిన్నర కాలంలో మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వనుందని మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలను సమీక్షించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో మిషన్‌ మోడ్‌లో పది లక్షల మందిని నియమించాలని పీఎం మోడీ ఆదేశించారని పీఎంవో ట్వీట్‌ చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల పరిస్థితిని సమీక్షించారు. రాబోయే 1.5 సంవత్సరాలలో ప్రభుత్వం 10 లక్షల (10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు) మిషన్ మోడ్‌లో నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు పీఎంవో సమాచారం ఇచ్చింది. నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయంగా ఇది చెప్పవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని ప్రధాని మోదీ తన సూచనలతో అధికారులు వేగంగా అడుగుల వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల (HR) పరిస్థితిని సమీక్షించారని, ఒకటిన్నర సంవత్సరాల్లో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో నియమించాలని ఆదేశించారని పీఎంఓ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ- స్వావలంబన భారతదేశం వైపు మరో అడుగు

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, PMO తరపున ఉద్యోగ ప్రకటనపై ట్వీట్ చేశారు. ఇది స్వావలంబన భారతదేశం కావడానికి మరో అడుగు అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కాలక్రమేణా ప్రభుత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చారని వెల్లడించారు.

దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి మోడీ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తుంటాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ నియామకాలపై తాజా ఆదేశాలు వచ్చాయి.

జాతీయ  వార్తల కోసం