AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crop Insurance Scheme: వర్షం కారణంగా అన్నదాత పంట నష్టపోతే ప్రభుత్వం పరిహారం, పూర్తి వివరాలు మీ కోసం..

దేశంలోని అనేక రాష్ట్రాల రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు దరఖాస్తు ఫారాన్ని నింపాలి. ఈ ఫారమ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉంది

Crop Insurance Scheme: వర్షం కారణంగా అన్నదాత పంట నష్టపోతే ప్రభుత్వం పరిహారం, పూర్తి వివరాలు మీ కోసం..
Crop Insurance Scheme
Surya Kala
|

Updated on: Sep 17, 2022 | 6:50 PM

Share

Crop Insurance Scheme: ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల పంట నష్టపోయినా, వరదల కారణంగా పంట మొత్తం నాశనమైనా అన్నదాత ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకున్నట్లయితే.. మీకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద, కరువు, తుఫాను, తుఫాను, అకాల వర్షం, వరదలు మొదలైన ప్రమాదాల వలన పంట నష్టపోతే.. ప్రభుత్వం అన్నదాతకు రక్షణ ఇస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే వారికి బీమా సౌకర్యం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు దాదాపు 36 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

పంట బీమాను సద్వినియోగం చేసుకోండి ఇలా.. 

దేశంలోని అనేక రాష్ట్రాల రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు దరఖాస్తు ఫారాన్ని నింపాలి. ఈ ఫారమ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉంది. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెబ్‌సైట్ https://pmfby.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఆఫ్‌లైన్ దరఖాస్తు కోసం రైతులు సమీపంలోని బ్యాంకు, సహకార సంఘం లేదా CSC (కామన్ సర్వీస్ సెంటర్)ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రైతులు పొలంలో విత్తనాలు వేసిన 10 రోజుల్లోపు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని రైతులు ఇక్కడ గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

పంట నష్టపోయిన సందర్భంలో రైతులు చేయాల్సిన పని 

వర్షం లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ పంటకు భారీ నష్టం జరిగితే, అప్పుడు ఏమి చేయాలనేది మీ మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన వెంటనే 72 గంటల్లో బీమా కంపెనీకి సమాచారం అందించాలి. మీ పంటపై వర్షం ఎంత ప్రభావం చూపిందో బీమా కంపెనీ చూస్తుంది. మూల్యాంకనం చేసిన తర్వాత.. జరిగిన పంట నష్టాన్ని అంచనావేస్తోంది. అనంతరం ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టానికి పరిహారం మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తారు.

ఏ పత్రాలు అవసరం అంటే:  ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా రైతు తన రేషన్ కార్డును సిద్ధంగా చేసుకోవాలి. దీనితో పాటు అన్నదాతకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉండాలి. ఆ బ్యాంక్ ఖాతా ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడి ఉండాలి. అలాగే రైతుల చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, రైతు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పొలం ఖాస్రా నంబర్ (సర్వే నంబర్), రైతు నివాస ధృవీకరణ పత్రం (ఇందు కోసం డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ మొదలైనవి ఉపయోగించవచ్చు), ఒకవేళ రైతులు పంట కోసం పొలాన్ని కౌలుకి తీసుకున్నట్లయితే.. అందుకు సంబంధించిన పత్రాలు.. అంటే పొలం యజమానితో ఒప్పందం చేసుకున్న పత్రాల ఫోటో కాపీ మొదలైనవి ఇవ్వవలసి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..