Odisha Train Accident: గొప్ప మనసు చాటుకున్న గౌతమ్ అదానీ.. వారందరికీ ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
ఒడిశా రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం ఎందరి జీవితాలనో శూన్యంలోకి నెట్టేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కొందరైతే, పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్ మరికొందరు. ఇలా...
ఒడిశా రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం ఎందరి జీవితాలనో శూన్యంలోకి నెట్టేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కొందరైతే, పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్ మరికొందరు. ఇలా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసిందీ ప్రమాదం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాను ప్రకంటించింది. ఇక ఆయా రాష్ట్రా ప్రభత్వాలు సైతం తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు పరిహారాన్ని అందించి ఆదుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. రైలు ప్రమాదంలో తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము ఉచిత స్కూలు విద్యా సౌకర్యాన్ని అందించే బాధ్యతను చేపడతామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ విషయాన్ని గౌతమ్ అదానీ స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పాఠశాల విద్యను అదానీ గ్రూప్ అందించనుంది. ప్రమాద బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..