AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tihar Jail Gang War: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. ఏకంగా 100 కత్తిపోట్లు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు..

తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. ఏకంగా 100 కత్తిపోట్లు.. సీసీటీవీలో నమోదైన ఈఘటన.. అత్యంత భయానకరంగా ఉంది. దేశంలోనే అత్యంత ప్రొటెక్షన్ కల్గిన తీహార్ జైల్లో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈనెల 2 వతారీఖున తీహార్ జైల్లో ఉన్న రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు టిల్లు తాజ్ పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా అతని అనుచరులు కత్తితో పొడిచి చంపారు.

Tihar Jail Gang War: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. ఏకంగా 100 కత్తిపోట్లు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు..
Tihar Jail
Shiva Prajapati
|

Updated on: May 05, 2023 | 9:03 AM

Share

తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. ఏకంగా 100 కత్తిపోట్లు.. సీసీటీవీలో నమోదైన ఈఘటన.. అత్యంత భయానకరంగా ఉంది. దేశంలోనే అత్యంత ప్రొటెక్షన్ కల్గిన తీహార్ జైల్లో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈనెల 2 వతారీఖున తీహార్ జైల్లో ఉన్న రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు టిల్లు తాజ్ పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా అతని అనుచరులు కత్తితో పొడిచి చంపారు. తీవ్రంగా గాయపడిన తాజ్ పురియాను జైలు సిబ్బంది ఢిల్లీలోని హాస్పిటల్ కి తరలించేసరికే చనిపోయాడు. అతను తప్పించుకుందామని ప్రయత్నించినా సెల్ నుంచి బయటకు లాగి మరీ చంపారు.

టిల్లు తాజ్ పురియాను చంపేందుకు యోగేష్ ముఠా మొదటి అంతస్థు నుంచి కిందకు బెడ్ షీట్స్ సహాయంతో దిగారు. ఆరుగురు వ్యక్తులు టిల్లు తాజ్ పురియాని సెల్ నుంచి బయటకు లాగి మరీ వీపు, భుజాలు, మెడపై.. ఇలా అతని శరీరంపై తాము తెచ్చుకున్న ఆయుధాలతో పొడిచి పొడిచి చంపడం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏకంగా ఓ 100 సార్లు దారుణంగా పొడిచి చంపినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

తీహార్‌ జైలంటే ఆషామాషీ కాదు. డే అండ్‌ నైట్‌ నిఘా వుంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. ఆయుధాలు కాదు కదా సిబ్బంది కళ్లు గప్పి పెన్ను.. పెంకు కూడా లోనికి తీసుకెళ్లే ప్రసక్తే ఉండదు. పైగా టిల్లు వున్నది హై రిస్క్‌ వార్డ్‌లో. అయినా హత్య జరిగింది. ఈ హత్యకు పాల్పడింది టిల్లు రైవలరీ గ్యాంగ్‌కు చెందిన నిందితుడు, షార్ప్‌ షూటర్‌ యోగేష్‌ తండా. ఇతను మరెవరో కాదు టిల్లు గ్యాంగ్‌ చేతిలో హతమైన జితేందర్‌ గోగి అనుచరుడు. రోహిణి కోర్టులో జితేందర్‌ గోగి హత్యకు ప్రతీకారమే తీహార్‌ జైలులో టిల్లు హత్యనా? అనే అనుమానం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక గోగి అండ్‌ టిల్లు.. ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య 12 ఏళ్లుగా వైరం ఉంది. వీరి గ్యాంగ్‌వార్‌లో 12 హత్యలు జరిగాయి. అయితే, తీహార్‌ జైలులో ఖైదీ టిల్లు తాజ్‌పురియా హత్య మరోసారి జైళ్ల నిర్వహణపై వేలేత్తి చూపేలా చేసింది. ఎందుకిలా? జైలు సిబ్బంది నిర్లక్ష్యమా? లేక జైలు అధికారులు, సిబ్బంది సహకారంతోనే కరడుగట్టిన నేరస్తులు జైలును అత్తారింటిలా మలుచుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..