కోవిడ్ సంక్షోభంలో తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యాసౌకర్యం కల్పించాలి, ప్రధానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ

ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో తమ తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ..ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆమె ఆయనకు లేఖ రాస్తూ కోవిద్ కారణంగా తమ పేరెంట్స్ లేదా తమ గార్డియన్స్ ని కోల్పోయిన పిల్లలకు...

కోవిడ్ సంక్షోభంలో తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యాసౌకర్యం కల్పించాలి,  ప్రధానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 20, 2021 | 7:29 PM

ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో తమ తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ..ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆమె ఆయనకు లేఖ రాస్తూ కోవిద్ కారణంగా తమ పేరెంట్స్ లేదా తమ గార్డియన్స్ ని కోల్పోయిన పిల్లలకు ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉచితంగా విద్యాభ్యాసం చేసేందుకు అనుమతించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషాద సమయంలో అమాయకులైన, అనాథలైన బాలలకు మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యగత మనపై ఉందని ఆమె అన్నారు. ఏ సపోర్ట్ లేని వీరిని ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోవాలన్నారు. 1996 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ పై జవహర్ నవోదయ విద్యాలయాల ప్రతిపాదన చేశారని, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూళ్లకు మించి ఉత్తమమైన విద్యను అభ్యసించేలా చూడాల్సిఉందని అన్నారని ఆమె గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 661 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని ఆమె తెలిపారు. కాగా ఈ లేఖకు సంబంధించిన కాపీని రాహుల్ గాంధీ తన ట్వీట్లకు జత చేశారు.

ఇలా ఉండగా ఢిల్లీ ప్రభుత్వం అప్పుడే ఇలా తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలకు 2,500 రూపాయల సహాయం చేస్తామని ప్రకటించింది. వారికి 25 ఏళ్ళు వచ్చేవరకు ప్రతినెలా ఈ సాయం అందుతుందని పేర్కొంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖపై స్పందించిన బీజేపీ నేత ఒకరు..ఈ ప్రతిపాదన కాలం చెల్లినదని, పలు రాష్ట్రాలు అప్పుడే ఇలా తమ పేరెంట్స్ ను కోల్పోయిన బాలలకు సాయం చేస్తున్నాయని అన్నారు. బహుశా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కనబడడం లేదన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో ) మధ్యదరా స‌ముద్రంలో ఘోరం….!! ప‌డ‌వ మునిగి 57 మంది మృతి… ( వీడియో )