AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: ఇంట్లో చెలరేగిన మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవ దహనం

కేరళ(Kerala)లో ఘోర ప్రమాదం జరిగింది. వర్కాల(Varkala) సమీపంలోని చెరున్నియూర్ లో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 8 నెలల చిన్నారి..

Crime news: ఇంట్లో చెలరేగిన మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవ దహనం
fire
Ganesh Mudavath
|

Updated on: Mar 08, 2022 | 11:21 AM

Share

కేరళ(Kerala)లో ఘోర ప్రమాదం జరిగింది. వర్కాల(Varkala) సమీపంలోని చెరున్నియూర్ లో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 8 నెలల చిన్నారి ఉండటం కలచివేస్తోంది. చెరున్నియూర్​కు చెందిన ప్రతాపన్​ఇంట్లో సోమవారం అర్ధరాత్రి మంటలు(Fire) చెలరేగాయి. ఇంట్లో మంటలు రావడాన్ని స్థానికులు గమనించి, అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఐదు ద్విచక్రవాహనాలు సైతం కాలి బూడిదయ్యాయి.

ప్రమాదంలో ప్రతాపన్, అతని భార్య షెర్లీ, చిన్న కుమారుడు అఖిల్, పెద్ద కూమారుడి భార్య అభిరామి, అతని 8 నెలల కుమారుడు రయాన్ చనిపోయినట్లుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన ప్రతాపన్​ పెద్ద కుమారుడు నిఖిల్​ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో షార్ట్ సర్క్యుట్ జరగడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read

IREDA- 2022 చీఫ్ రిస్క్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం..

NAL Bengaluru Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే!

Tamilnadu: బాత్‌రూమ్‌లో జారిపడ్డ మహిళ.. గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌ బ్రష్‌.. డాక్లర్లు ఏం చేశారంటే..

Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు