NAL Bengaluru Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే!

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (NAL) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Specialist Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NAL Bengaluru Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే!
Csir Nal
Follow us

|

Updated on: Mar 08, 2022 | 9:53 AM

CSIR NAL Specialist Consultant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (NAL) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Specialist Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఖాళీల వివరాలు: స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

విభాగాలు: స్పెషలిస్ట్‌ స్ట్రక్చరల్‌ డిజైన్‌ కన్సల్టెంట్‌, నాసెల్లె అండ్‌ ఎయిర్‌ ఫ్రేమ్‌ డిజైన్‌ యాక్టివిటీస్‌, డిజైన్‌ యాక్టివిటీస్‌, టూల్‌ డిజైన్‌ యాక్టివిటీస్‌.

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 64 ఏళ్లకు మించారదు.

పే స్కేల్: నెలకు రూ.75,000ల నుంచి రూ,1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: ది సీనియర్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌, పోస్ట్‌ బాక్స్‌ నెంబర్‌ 1779, హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్, కొడిహల్లి, బెంగళూరు-560017.

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIP Jobs 2022: నెలకు రూ.57,000 జీతంతో..సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

Latest Articles