Tamilnadu: బాత్‌రూమ్‌లో జారిపడ్డ మహిళ.. గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌ బ్రష్‌.. డాక్లర్లు ఏం చేశారంటే..

ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో కాలుజారి కింద పడిపోయిన ఓ మహిళలకు అనుకోని కష్టం వచ్చిపడింది. ప్రమాద సమయంలో పళ్లుతోముకుంటోన్న ఆమె గొంతులో టూత్‌ బ్రష్‌ ఇరుక్కుపోయింది

Tamilnadu: బాత్‌రూమ్‌లో జారిపడ్డ మహిళ.. గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌ బ్రష్‌.. డాక్లర్లు ఏం చేశారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Mar 08, 2022 | 9:26 AM

ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో కాలుజారి కింద పడిపోయిన ఓ మహిళలకు అనుకోని కష్టం వచ్చిపడింది. ప్రమాద సమయంలో పళ్లుతోముకుంటోన్న ఆమె గొంతులో టూత్‌ బ్రష్‌ ఇరుక్కుపోయింది. అంతేకాదు తన చెంపను చీల్చుకుంటూ సగం బయటకు వచ్చింది. త‌మిళ‌నాడులోని కాంచీపురం (Kanchipuram)లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలోరేవ‌తి అనే 34 ఏళ్ల మ‌హిళ ఉద‌య‌మే బ్రష్‌ చేసుకుంటోంది. అయితే పొరపాటున కాలు జారి వాష్‌రూమ్‌లో ప‌డిపోయింది. ఆ సమయంలో ఆమె త‌ల నేల‌కు గ‌ట్టిగా తాకింది. దీంతో నోటిలో ఉన్న బ్రష్‌ కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. చెంపనుచీల్చుకుంటూ స‌గం బ‌య‌ట‌కు రావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రేవతి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. వెంట‌నే ఆమె కుటుంబ సభ్యులు కాంచీపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు.

కాగా ఆమె ప‌రిస్థితిని చూసిన డాక్టర్లు… టూత్‌ బ్రష్‌ రేవ‌తి చెంప‌ను చీల్చుకుంటూ స‌గం బ‌య‌టికి రావ‌డం వ‌ల్ల చెంప నుంచే దాన్ని అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. చెంపపైనే ఇంకాస్త గాటుపెట్టి నోటి లోపల పళ్లకింద ఇరుక్కుపోయిన బ్రష్‌ను బయటకు తీశారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో రేవతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయినప్పటికీ కొన్ని రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలంటున్నారు. కాగా గత నెల మధ్యప్రదేశ్‌లో కూడా ఓ మహిళ ఊపిరితిత్తుల్లో లవంగం ఇరుక్కుపోయింది. దీంతో ఆమె బరువు తగ్గడంతో పాటు, తీవ్రమైన దగ్గు, ఉమ్మిలో రక్తం పడడం వంటి సమస్యలతో బాధపడింది. మొదట్లో డాక్టర్లు దీనిని క్యాన్సర్‌గా భావించారు. అయితే మరిన్ని పరీక్షలు చేసి ఊపిరిత్తుల్లో లవంగాన్నిగుర్తించారు. సర్జరీ చేసి విజయవంంగా లవంగాన్ని తొలగించారు.

Also Read:మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ!.. ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆ తరువాత బిగ్ షాక్ ఇచ్చింది..!

Sunil Gavaskar-Shane Warne: షేన్ వార్న్‌ గురించి అలా అనాల్సింది కాదు.. అసలు అలా ప్రశ్నించడమే తప్పు: సునీల్ గవాస్కర్

IOCL Recruitment 2022: నెలకు రూ. 1,05,000 జీతంతో..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..