AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navi IPO: మెగా ఐపీఓతో ముందుకొస్తున్న నావీ.. 97 శాతం వాటా కలిగి ఉన్న ఫిప్ కార్ట్ సహవ్యవస్థాపకుడు..

Navi IPO: సచిన్ బన్సల్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) కు పోటీగా దేశీయంగా ఫిప్ కార్ట్ ను ఏర్పాటు చేసిన సహవ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు.

Navi IPO: మెగా ఐపీఓతో ముందుకొస్తున్న నావీ.. 97 శాతం వాటా కలిగి ఉన్న ఫిప్ కార్ట్ సహవ్యవస్థాపకుడు..
Navi Ipo
Ayyappa Mamidi
|

Updated on: Mar 08, 2022 | 9:03 AM

Share

Navi IPO: సచిన్ బన్సల్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) కు పోటీగా దేశీయంగా ఫిప్ కార్ట్ ను ఏర్పాటు చేసిన సహవ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 2007 లో ఫిప్ కార్ట్(Flip Kart) సంస్థను స్థాపించటంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించారు. కానీ..2018లో కంపెనీలో తన వాటాను వాల్ మార్ట్ సంస్థకు విక్రయించి బయటకు వచ్చేశారు సచిన్. అసలు విషయం ఏమిటంటే.. ఆయన త్వరలోనే ఒక ఐపీఓతో మార్కెట్ ముందుకు రాబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అది కూడా రూ.4 వేల కోట్ల మెగా పెట్టుబడికోసం. ఈ వారం చివరి నాటికి దీనికి సంబంధించి సెబీ ముందు దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఇది దేనిలోనంటే ఫిన్ టెక్ కంపెనీ నావీలో. ఈ నావీ కంపెనీలో సచిన బన్సల్ 97 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈ ఇష్యూలో కేవలం కొత్త షేర్ల విక్రయం మాత్రమే ఉంటుందని.. ఆఫర్ ఫర్ సేల్ లేదని తెలుస్తోంది. అంటే సచిన తవ వాటాలను కంపెనీలో కొనసాగించనున్నట్లు స్పష్టమవుతోంది. అతనితో పాటు.. నావీలో కొ-ఫౌండర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకిత్ అగర్వాల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేష్ సుఖ్తాంకర్ ఈ బెంగళూరుకు చెందిన సంస్థలో వాటాలను కలిగి ఉన్నారు. సుఖ్తాంకర్ నావీలో బోర్డు పరిశీలకుడిగా కూడా ఉన్నారు. బన్సల్ ఇప్పటికే ఈ ఫిన్ టెక్ కంపెనీలో మెుత్తం రూ.4 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టారు.

నావీ తన సొంత మ్యూచువల్ ఫండ్ వ్యాపారంతో పాటు వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్సింగ్ లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2019 సెప్టెంబర్‌లో నావీ చైతన్య క్రెడిట్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ప్రస్తుతం నావీ కంపెనీ లోన్ బుక్ విలువ రూ.20 వేల కోట్లుగా ఉందని తెలుస్తోంది. రానున్న రెండు సంవత్సరాల కాలంలో మరో రూ. 15 వేల కోట్లను కంపెనీ మార్కెట్ల నుంచి సమీకరించి వ్యాపార కార్యకలాపాల వృద్ధికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది. గత నెల 30 లక్షల యాక్టివ్ కస్టమర్లతో రూ.500 కోట్ల మేర లోన్లను ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న కాలంలో నెలకు రూ.900 నుంచి రూ.1000 కోట్ల మెుత్తాన్ని లోన్లుగా ఇవ్వాలని కంపెనీ యోచిస్తోంది.

ఇవీ చదవండి..

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..

Multiplex Business: ఆ రెండు సంస్థల విలీనం.. డీల్ జరిగితే సినిమా వ్యాపారంలో పెను మార్పే..