Sunil Gavaskar-Shane Warne: షేన్ వార్న్ గురించి అలా అనాల్సింది కాదు.. అసలు అలా ప్రశ్నించడమే తప్పు: సునీల్ గవాస్కర్
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్‌గా షేన్ వార్న్‌ను అంగీకరించడానికి గవాస్కర్ నిరాకరించాడు. ఆ తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) షేన్ వార్న్‌పై చేసిన కామెంట్స్ ఎంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన తప్పును గ్రహించిన భారత మాజీ క్రికెటర్, అలా అనాల్సింది కాదంటూ వివరణ ఇచ్చాడు. షేన్ వార్న్(Shane Warne) మరణంతో ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిన తరుణంలో అతని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఇది ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) కు పెద్ద నష్టం. ‘‘నా దృష్టిలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ అత్యుత్తమ స్పిన్నర్ కాదు. వార్న్ కంటే టీమిండియా స్పిన్నర్లు, శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ ఎంతో మెరుగైనవారు. దానికి కారణం కూడా ఉంది. భారత్‌లో షేన్ వార్న్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇక్కడ ఒకే ఒక్కసారి మాత్రమే 5 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ బౌలింగ్‌లో ఎంతో సమర్ధంగా ఎదుర్కొగల భారత బ్యాటర్లపై అతడు పెద్దగా విజయవంతం కాలేదు. దీంతో షేన్ వార్న్‌ను గొప్ప స్పిన్నర్‌గా చెప్పలేం’’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. దీంతో తప్పు తెలుసుకున్న లిటిల్ మాస్టర్ తన ప్రకటనపై క్లారిటీ ఇచ్చాడు.
షేన్ వార్న్ ప్రకటనపై గవాస్కర్ వివరణ ఇస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో అతను ఇలా అన్నాడు, “గత వారం క్రికెట్‌కు బాధాకరమైనది. ఇందులో మేం ఇద్దరు ఆటగాళ్ళు షేన్ వార్న్, రోడ్నీ మార్ష్‌లను కోల్పోయాం” అని చెప్పుకొచ్చాడు. వార్న్‌కు సంబంధించి తన ప్రకటనపై, షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ కాదా అని ఒక యాంకర్ నన్ను అడిగాడు. నేను అతనికి నా ప్రతిస్పందనను నిజాయితీగా వెల్లడించాను, అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ ప్రశ్న అడగకూడదు: గవాస్కర్ సరైన సమాధానం ఇవ్వడానికి ఇది సమయం కాదు, కాబట్టి ఆ ప్రశ్న అడగకూడదు లేదా సమాధానం ఇవ్వకూడదు అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. వార్న్ గొప్ప క్రికెటర్లలో కచ్చితంగా ఒకడు. రాడ్ మార్ష్ కూడా గొప్ప వికెట్ కీపర్లలో ఒకడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
Also Read: Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో
రంజీ ట్రోఫీలో ‘నయా కోహ్లీ’ వీరవిహారం.. 3 మ్యాచ్‌ల్లో 526 పరుగులతో బౌలర్ల ఊచకోత.. ఎవరో తెలుసా?