రంజీ ట్రోఫీలో ‘నయా కోహ్లీ’ వీరవిహారం.. 3 మ్యాచ్‌ల్లో 526 పరుగులతో బౌలర్ల ఊచకోత.. ఎవరో తెలుసా?

రంజీ ట్రోఫీలో 'నయా కోహ్లీ' వీరవిహారం.. 3 మ్యాచ్‌ల్లో 526 పరుగులతో బౌలర్ల ఊచకోత.. ఎవరో తెలుసా?
Turavar Kohli

'కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ'.. ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో ఈ పేరు మారుమ్రోగుతోంది. అదేంటి 'కోహ్లీ' పేరు అని...

Ravi Kiran

|

Mar 07, 2022 | 8:11 PM

‘కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ’.. ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో ఈ పేరు మారుమ్రోగుతోంది. అదేంటి ‘కోహ్లీ’ పేరు అని అనుకుంటున్నారా.? అయితే ఇక్కడ హెడ్‌లైన్స్‌లో ఉన్నది ‘విరాట్ కోహ్లీ’ పేరు కాదండోయ్.. ఇతడి పేరు తరువార్ కోహ్లీ(Taruwar Kohli). అయితే ఈ కోహ్లీలిద్దరూ మాత్రం భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించడం విశేషం. సరే ఇవన్నీ పక్కన పెడదాం.. ముందు తరువార్ కోహ్లీ గురించి తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తుంటే.. దేశవాళీ క్రికెట్‌లో తరువార్ కోహ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. రంజీ ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో మిజోరాం తరపున ఆడుతోన్న తరువార్ కోహ్లీ.. ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లను ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తూ.. ప్రస్తుతం హెడ్ లైన్స్‌లో నిలిచాడు.

ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో తరువార్ కోహ్లీ 151 పరుగులు చేశాడు. ఈ రంజీ సీజన్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన మూడో సెంచరీ ఇది. కోహ్లీ ఇప్పటివరకు 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 51.02 సగటుతో 3827 పరుగులు చేశాడు. పంజాబ్‌ తరపున రంజీ అరంగేట్రం చేసి, ఆపై కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత, ఇప్పుడు మిజోరం జట్టుకు ఆడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు తరువార్ కోహ్లీ.

6 ఇన్నింగ్స్‌లు, 3 సెంచరీలు, 526 పరుగులు..

తరువార్ కోహ్లీ 2022 రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలోని 6 ఇన్నింగ్స్‌లలో 131.5 స్ట్రైక్ రేటుతో 526 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 1 అర్ధ సెంచరీ ఉంది. 33 ఏళ్ల తరువార్ కోహ్లీ.. 3 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, ఆటపై ఉన్న ఇష్టంతో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. ఆ క్రమంలోనే అండర్-19 ప్రపంచకప్ జట్టులోనూ ఎన్నికయ్యాడు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. రంజీలో మొదట పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తరువార్ కోహ్లీ.. ఆ జట్టులో సరైన అవకాశాలు రాకపోవడంతో.. ఆ తర్వాత మిజోరాం జట్టులోకి చేరాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu