R Priya: తమిళ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన డీఎంకే.. చెన్నై మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ..
R Priya Chennai Mayor: తమిళ రాజకీయాలలో డీఎంకే ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంది. డీఎంకేకు చెందిన 29 ఏళ్ల ఆర్. ప్రియను
R Priya Chennai Mayor: తమిళ రాజకీయాలలో డీఎంకే ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంది. డీఎంకేకు చెందిన 29 ఏళ్ల ఆర్. ప్రియను చెన్నై మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు సీఎం స్టాలిన్. దీంతో ప్రియా పేరు తమిళనాడులో మార్మోగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు… ఏకకాలంలో ఆమె రెండు రికార్డులను సాధించారు. 29 ఏళ్ల పిన్న వయస్సులోనే చెన్నై మేయర్‌గా ఎంపిక కావడమే కాకుండా, మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత మహిళగా ఖ్యాతి గడించారు ప్రియా. తమిళనాడులో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, ప్రభుత్వం చెన్నై మేయర్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేసింది. చెన్నై కార్పొరేషన్‌లో 74వ వార్డు మంగళపురం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన ప్రియా భారీ మెజార్టీతో గెలిచారు. కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె మేయర్ పదవి దక్కుతుందని మాత్రం ఊహించలేదు. అనూహ్యంగా చెన్నై మేయర్ అభ్యర్థిగా ప్రియాను డీఎంకే (DMK) అధిష్టానం ప్రకటించింది. అంతే, అత్యధిక మెజార్టీతో మేయర్‌గా ఎన్నికై రికార్డు నెలకొల్పింది.
చెన్నై మేయర్‌గా వ్యవహరించిన మహిళల్లో ప్రియా మూడో వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు తారా చెరియన్, కామాక్షి జయరామన్ మేయర్లుగా పనిచేశారు. చెన్నై ఉత్తర ప్రాంతం నుంచి మేయర్‌గా ఎంపికైన మహిళగా ప్రియా మరో రికార్డు క్రియేట్ చేశారు. ఓ దళిత మహిళ చెన్నై మేయర్‌గా ఎన్నికవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు చేపట్టడంపై అటు దళితులతోపాటు ఇటు మహిళలు ప్రియను కొనియాడుతున్నారు. తనపై ఉంచిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానంటున్నారు ప్రియా. చెన్నైలో రహదారులు, పారిశుధ్యం మెరుగు, మహిళా సాధికారతకు తనవంతు కృషిచేస్తానని స్పష్టం చేస్తున్నారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రియా.
Also Read: