Vigilance Attacks: విజిలెన్స్ దాడులకు భయపడి.. పక్కింట్లోకి రూ. 2 కోట్ల నగదు విసిరేశాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..
విజిలెన్స్ దాడులకు భయపడి ఓ ప్రభుత్వ అధికారి.. పొరుగింటి టెర్రస్‌పై రూ. 2 కోట్ల నగదు విసిరేసిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. అది పసిగట్టిన అధికారులు మాత్రం.. ఆ నోట్ల కట్లలను స్వాధీనం చేసుకుని ఆయనకు షాక్ ఇచ్చారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆ భయం ఎలా ఉంటుందో తెలిసిందే. అక్రమంగా డబ్బులు సంపాదించడం, వాటిని తెలియకుండా మేనేజ్ చేయడం.. వాటిని కాపాడుకునేందుకు అనుక్షణం టెన్షన్ పడడం ఇవన్నీ అక్రమాస్తుల అధికారుల విషయంలో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఉన్నతాధికారి విషయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రశాంత్‌కుమార్ రౌత్ అనే వ్యక్తి ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు అదనపు సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయనపై ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగివున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దాంతో.. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
భువనేశ్వర్‌లోని ఆయన నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. అప్రమత్తమైన ఆయన.. వాటిని ఆరు బాక్సుల్లో నగదు నింపి, పక్కింటి టెర్రస్‌పై విసిరేశాడు. ఇది గుర్తించిన అధికారులు ఆ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతకుమార్ రౌత్ ఇటీవలే రద్దైన రూ. 2000 నోట్లను రూ. 500 నోట్లుగా మార్పిడి చేసుకున్నాడు. వీటిని 6 బాక్సుల్లో దాచి పెట్టారు. అయితే.. సడెన్‌గా విజిలెన్స్ దాడులు జరగటంతో కంగారు పడిపోయారు. ఆ భయంతో.. సుమారు 2కోట్లకు పైగా ఉన్న డబ్బుల బాక్సులను పక్కింటి టెర్రస్ పైకి విసిరేశారు. దానిని పసిగట్టి.. స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు విజిలెన్స్ అధికారులు.
ఇక.. మరో తొమ్మిది ప్రాంతాల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. ఈ క్రమంలోనే.. నబరంగ్‌పూర్‌లోనూ మరో 77 లక్షలు పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో రూ. 3 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నారు. రౌత్ నబరంగ్‌పూర్ జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో సుందర్‌గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో లంచం కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..