AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father kills Daughter: లవర్‌తో మాట్లాడుతున్న కూతురిని చంపి.. బావిలో పడేసిన తండ్రి, సోదరులు..

తలకు గాయం కారణంగా సాదియా స్పృహతప్పి పడిపోయింది. అయితే కూతురు చనిపోయిందని భావించి, ముస్తఫా ..  అతని ఇద్దరు కుమారులు షేక్ మొహమ్మద్. బకాష్ మరియు మొహమ్మద్. షాద్ కలిసి సాదియా కౌసర్ మృతదేహానికి ఇటుక కట్టి ఇంటి సమీపంలోని బావిలో పడేశారు. 

Father kills Daughter: లవర్‌తో మాట్లాడుతున్న కూతురిని చంపి.. బావిలో పడేసిన తండ్రి, సోదరులు..
Father Kills Daughter
Surya Kala
|

Updated on: Feb 21, 2023 | 11:44 AM

Share

తన కూతురు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతుందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూతురిని హత్య చేసి బావిలో పడేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైసాబాలో చోటు చేసుకుంది. అంతేకాదు తాము చేసిన హత్యను కూతురు లవర్ ను నిందితుడిగా చిత్రీకరించేందుకు తండ్రి సహా కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నం చేశారు. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యారు. ఇదే విషయంపై పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ మాట్లాడుతూ..ముస్తఫా అహ్మద్ అనే వ్యక్తి.. ఫిబ్రవరి 9 రాత్రి తన 20 ఏళ్ల కుమార్తె సాదియా కౌషర్ కనిపించడం లేదని మర్నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఫిబ్రవరి 9 రాత్రి కూతురు సాదియా కౌషర్ వీడియో కాల్ లో తన లవర్ తో మాట్లాడుతుందని తండ్రి మహ్మద్ ముస్తాఫా అహ్మద్ భావించాడు. దీంతో తన కుమార్తెను దారుణంగా కొట్టాడు. తండ్రికి ఇద్దరు కొడుకులు సహకరించారు. తలకు గాయం కారణంగా సాదియా స్పృహతప్పి పడిపోయింది. అయితే కూతురు చనిపోయిందని భావించి, ముస్తఫా ..  అతని ఇద్దరు కుమారులు షేక్ మొహమ్మద్. బకాష్ మరియు మొహమ్మద్. షాద్ కలిసి సాదియా కౌసర్ మృతదేహానికి ఇటుక కట్టి ఇంటి సమీపంలోని బావిలో పడేశారు.

మర్నాడు తన కూతురు కనిపించడం లేదని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు కుమార్తె ప్రియుడిపై ముస్తఫా అహ్మద్ చక్రధర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం, హత్య కేసు నమోదు చేశాడు. అదే సమయంలో, ప్రేమికుడిని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులపై నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు. సాదియాను లవర్ అత్యాచారం చేసి, తన కూతును చంపేసినట్లు ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ముందు లవర్ నిందితుడి అని భావించారు.  దర్యాప్తు మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 13న ఇంటి సమీపంలోని బావిలో సదియా మృతదేహం లభ్యమైంది. డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు శాస్త్రీయ కోణంలో పరిశోధన చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించారు. హత్య అనంతరం తండ్రి కొడుకులు తమకు ఏం తెలియనట్లు.. ఎవరికీ అనుమానం రాకుండా దుకాణానికి వెళ్లి పనిచేసేవారు.  కూతురుకి ఫోన్ లో లవర్ తో మాట్లాడవద్దని హెచ్చరించినా తీరు మార్చుకోలేదని.. దీంతో కోపంతో హత్య చేసినట్లు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..