AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకృష్ణ ఆలయంలో భక్తులను దీవిస్తున్న ఏనుగు.. ఇది చాలా పవర్‌ఫుల్‌ గురూ..! విశిష్టత ఏంటంటే..

అయితే, దేవాలయంలో పెంచిన ఏనుగులు అనేక ఇబ్బందులు పడుతున్నాయని, వాటికి సరైన సంరక్షణ ఇవ్వడం లేదని, అనేక చిత్రహింసలకు గురవుతున్నాయని జంతు సంరక్షణ కార్యకర్తలతో పాటు అనేక పార్టీలు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నాయి.

శ్రీకృష్ణ ఆలయంలో భక్తులను దీవిస్తున్న ఏనుగు.. ఇది చాలా పవర్‌ఫుల్‌ గురూ..! విశిష్టత ఏంటంటే..
Robotic Elephant
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2023 | 12:13 PM

Share

ఆధునిక కాలంలో అనేక పద్ధతులు, ఆచారాలు మారుతున్నట్లే ఇప్పుడు భగవంతుడి సేవలో పాల్గొనే ఏనుగులు కూడా రోబోలు వచ్చేశాయి. ఇది చూడ్డానికి అచ్చం నిజం ఏనుగులానే ఉంటుంది. కేరళలోని త్రిసూరు ఆలయంలో రోబో ఏనుగు భక్తులకు ఆశీర్వాదాలు అందించనుంది. హైలైట్ ఏంటంటే.. ఆలయ సేవా పనులకు రోబో ఏనుగును వినియోగించడం ఇదే తొలిసారి. తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ఏనుగులను ఎక్కువ సంఖ్యలో పెంచుతారు. ఆలయ ఉత్సవాల్లో ఏనుగులే ప్రధాన వాహనం. ఆలయాన్ని సందర్శించే భక్తులను ఏనుగుతో అనుగ్రహించడం కూడా ఆనవాయితీ. ముఖ్యంగా కేరళలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వాటితో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇది ఒక వైపు అయినప్పటికీ, దేవాలయంలో పెంచిన ఏనుగులు అనేక ఇబ్బందులు పడుతున్నాయని, వాటికి సరైన సంరక్షణ ఇవ్వడం లేదని, అనేక చిత్రహింసలకు గురవుతున్నాయని జంతు సంరక్షణ కార్యకర్తలతో పాటు అనేక పార్టీలు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించే క్రమంలో ఇప్పుడు ఓ రోబో ఏనుగు కేరళలోని ఓ ఆలయానికి సేవలు అందించనుంది. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు.

ఇది అచ్చం నిజం ఏనుగులానే ఉంటుంది. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు. ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని ఆలయ అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి తెలిపారు. . మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని తెలిపారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..