Ramakrishna Jayanti 2023: ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి.. వివేకానందుని అందించిన రామకృష్ణ పరమహంస జయంతి నేడు..
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. రామకృష్ణపరమహంస జన్మదినం ప్రతి ఏడాది జరుపుతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రామకృష్ణ పరమహంస 187వ జయంతి ఫిబ్రవరి 21న నిర్వహించబడుతుంది.

ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. పిలిస్తే పలికే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు.. ఒక సజీవ సత్యం. అయితే ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి.. ఆధ్యాత్మిక చరిత్రలో రామకృష్ణ పరమహంసగా నిలిచిన మహనీయుడు. ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి.. నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా హిందూ సనాతన ధర్మానికి అందించిన మహాప్రవక్త రామకృష్ణపరమహంస జయంతి నేడు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, సాధువు , హిందూ మత గురువు రామకృష్ణ పరమహంస సంక్లిష్టమైన ఆధ్యాత్మిక బోధనలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళీకరించారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. రామకృష్ణపరమహంస జన్మదినం ప్రతి ఏడాది జరుపుతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రామకృష్ణ పరమహంస 187వ జయంతి ఫిబ్రవరి 21న నిర్వహించబడుతుంది.
రామకృష్ణ పశ్చిమ బెంగాల్‌లోని కమర్పుకూర్‌లో 1836 ఫిబ్రవరి18న కుదీరా, చంద్రమణి దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఈయనకు గదాధర్ ఛటోపాధ్యాయ నామకరణం చేసారు. అయితే రామకృష్ణ తల్లిదండ్రులు తమ కుమారుడు ఏదో ఒకరోజు ఆధ్యాత్మిక గురువుగా ఎదుగుతాడని ముందే గుర్తించారు.




విద్యార్థులకు ఆధ్యాత్మిక అభ్యాసాలు, జీవితంలో చదువు ప్రాముఖ్యత గురించి తక్కువ లేదా ఏమీ బోధించకుండానే ఈ ప్రపంచంలో లాభాలు పొందడం.. తమను తాము ఎలా నిలబెట్టుకోవాలో విద్యార్థులకు నేర్పడానికి విద్యా విధానం రూపొందించబడిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రామాయణం, మహాభారతం, భాగవత పురాణం వంటి మత గ్రంథాలలో బాగా ప్రావీణ్యం సంపాదించారు. రామకృష్ణ పరమహంస కాళీ దేవి గొప్ప భక్తుడు. పశ్చిమ బెంగాల్‌లో హిందూ మతం పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు
రామకృష్ణ పరమహంస స్ఫూర్తిదాయకమైన కోట్స్
- “మనస్సు ఒకరిని జ్ఞానవంతుడిని లేదా అజ్ఞానిని చేస్తుంది, కట్టుబడి లేదా విముక్తి చేస్తుంది.”
- మానవ జీవిత లక్ష్యం ‘అంతిమ వాస్తవికత’ సాక్షాత్కారం మాత్రమే మనిషికి అత్యున్నతమైన పరిపూర్ణతను, శాశ్వతమైన శాంతిని ఇవ్వగలదు. ఇది అన్ని మతాల సారాంశం.
- కేవలం రెండు రకాల వ్యక్తులు మాత్రమే స్వీయ-జ్ఞానాన్ని పొందగలరు. నేర్చుకోని వారు, అంటే, ఇతరుల నుండి అరువు తెచ్చుకున్న ఆలోచనలతో నిండిన మనస్సులు లేనివారు.. మరొకరు అన్ని గ్రంథాలు, శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత, తమకు ఏమీ తెలియదని గ్రహించిన వారు.
- మీ విశ్వాసం మాత్రమే నిజం.. ఇతరుల విశ్వాసం అబద్ధం అని ఎప్పుడూ ఆలోచించవద్దు. రూపం లేని దేవుడు నిజం కాదని ఆలోచించవద్దు.. రూపం లేకపోయినా దేవుడు కూడా నిజమని ఖచ్చితంగా తెలుసుకో. అప్పుడు మీకు నచ్చిన విశ్వాసాన్ని అనుసరించండి.
- మనస్సు స్వచ్ఛత ‘అంతిమ వాస్తవికత’ సాధించడానికి ఒక ముఖ్యమైన పరిస్థితి.. నిజమైన స్వచ్ఛత అంటే కామం, దురాశ నుండి విముక్తి. బాహ్య ఆచారాలు ద్వితీయ ప్రాముఖ్యత మాత్రమే.
- పవిత్ర గ్రంథాలలో చాలా మంచి సూక్తులు కనిపిస్తాయి. కానీ వాటన్నీ చదవడం వలన ఒక మతం ఏర్పడదు
- ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మనిషి తన చెడు ధోరణులను అధిగమించగలడు. దైవం కృపతో పాపాలు చేసిన వ్యక్తి కూడా మోక్షాన్ని పొందగలడు. కనుక గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా.. భగవంతుని శరణు కోరుతూ.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)