Srikakulam: శ్రీముఖ లింగేశ్వరుడి చక్రస్నానం.. భక్తజన సంద్రంగా మారిన పవిత్ర వంశధార నది

దక్షిణ కాశీగా పేరుందిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో స్వామివారి చక్ర తీర్థ స్నానం అత్యంత ఘనంగా జరిగింది. మంగళ స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో వంశధార నది తీరం మారుమోగింది.

Srikakulam: శ్రీముఖ లింగేశ్వరుడి చక్రస్నానం.. భక్తజన సంద్రంగా మారిన పవిత్ర వంశధార నది
Srimukhalingam Temple
Follow us
Surya Kala

|

Updated on: Feb 21, 2023 | 7:13 AM

దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామి వారి చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి స్వామివారు నంది వాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదిలో మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారు చేరుకున్నారు. అర్చకులు భక్త జన సందోహం మధ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రతీర్ధ స్నానం నిర్వహించారు అర్చక స్వాములు.

మిరియాబిల్లి రేవులో స్వామివారికి చక్ర స్నానం ఆచరించగా దిగువున అదే నదీ తీరంలో తండోప తండోలుగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మంగళ స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవిత్రమైన వంశధార… జనధారలా సాగిపోయింది. శివ నామ స్మరణతో మారు మ్రోగింది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి, పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీముఖ లింగేశ్వరుడి చక్ర తీర్థ స్నానంతో పవిత్ర వంశధార నది ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. స్వామి వారు చక్ర తీర్థం రోజున ఆ పవిత్ర జలాలలో తాము స్నానం చేస్తే..అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?